చిరంజీవిరావుకి అత్యధిక ఓట్లు రావడానికి కారణమిదే


Ens Balu
116
Visakhapatnam
2023-03-17 01:35:57

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి భారీ మెజార్టీ దిశగా దూసుకెళుతున్నారు. అధికారపార్టీ అభ్యర్ధి రెండవ స్థానానికి, పీడిఎఫ్ అభ్యర్ధి మూడవ స్థానానికి, బిజేపీ అభ్యర్ధి నాల్గవ స్థానంలోనూ కొనసాగుతున్నారు. టిడిపి అభ్యర్ధి డా.వేపాడచిరంజీవిరావు(ఎకానమీ చిరంజీవి)ప్రముఖ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్ లో పనిచేశారు. ఆ తరువాత ప్రత్యేకంగా ఆయన ఎన్నోవేలమంది విద్యార్ధులకు ఎకానమీ పాఠాలు బోధించారు. ఆయనదగ్గర చదువుకున్న ఎందరో విద్యార్ధులు, ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా పెద్ద పెద్ద అధికారులుగా స్థిరపడ్డారు. నాడు ఆయన చెప్పిన పాఠలు నేడు ఉత్తరాంధ్రా పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధికి వ్యతిరేక ఓటు గుణపాఠంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తుంది. అధికార దుర్వినియోగం చేసినా కూడా ఓటర్లలో మార్పు వచ్చిందని చెప్పడానికి ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఐదురౌండ్ల ఫలితాలు మిగిలి ఉన్నాయి.
సిఫార్సు