ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి


Ens Balu
7
Tirupati
2023-03-17 06:47:20

ఉమ్మడి ప్రకాశం –నెల్లూరు–చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ప్రాధాన్యతా ప్రకారం ఓట్ల లెక్కింపులో చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటనతో డిక్లరేషన్ అందించామని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆర్ వి యస్ లా కాలేజీ కౌంటింగ్ ప్రక్రియ జరిగిన మూట్ కోర్ట్ హాల్ నందు రిటర్నింగ్ అధికారి ఉపాధ్యా యుల  ఎన్నికల్లో గెలుపొందిన చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి కి డిక్లరేషన్ ను అందించారు. ఈ నెల 16 న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 8 గం.ల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై 17 న ఉదయం 3 గం.ల వరకు కొన సాగిన ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియతో తన సమీప అభ్యర్థి బాబురెడ్డి పొక్కి రెడ్డి పై 1,043 ఓట్ల ఆధిక్యంతో చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి గెలుపొందడంతో ఎన్నికల కమిషన్ జారీ చేసిన డిక్లరేషన్ ను అందుకున్నారు. ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యతా ప్రక్రియ విధానంతో మొత్తం 24,291 ఓట్లకు గానూ చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి కి 11,714 ఓట్లు, బాబురెడ్డి పొక్కి రెడ్డి కి 10,671 ఓట్లు రాగా, 1906 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదైందని తెలిపారు. డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్ డిక్లరేషన్ అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.       
సిఫార్సు