ఉత్తరాంధ్రలో పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్పారు
VK.Mahesh
23
Anakapalle
2023-03-17 16:22:26
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరాంధ్రాలోని పట్టభద్రులు సరైన రీతిలో వ్యతిరేక ఓటుతో బుద్ధిచెప్పారని జనసేన పార్టీ అనకాపల్లి సమన్వయకర్త పరుచూరి భాస్కరరావు ఎద్దేవా చేశారు. శుక్రవారం అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రజలకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అధికారపార్టీ అంటే ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలతో మొండిగా వ్యవహరించే ప్రభుత్వాలకు ప్రజలు ఓటు తో ఇలాంటి గుణపాఠాలే చెబుతారన్నారు. రాష్ట్రబడ్జెట్ లో ఐటిశాఖకు కేవలం రూ.215 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం పార్టీ సొంత కార్యక్రమాలకే అత్యధికం గా కేటాయించినా ప్రశ్నించే దైర్యంలేని మంత్రి అమర్నాధ్ అభివ్రుద్ధి కోసం మాట్లాడం సిగ్గుచేటన్నారు. జనరంజక బడ్జెట్ అని గొప్పలకు పోయే వైఎస్సార్సీపీ ఇది పూర్తిగా వైఎస్సార్సీపీ బడ్జెట్ అని తెలుసుకునే లోపే ప్రజలు పెద్ద ఎత్తున బుద్దిచెప్పారని ఆరోపించారు.