ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటింగ్ వార్ వన్ సైడ్ అయినట్టుగా చేశారు. అధికారపార్టీ అభ్యర్ధి సీతంరాజు సుధాక ర్ పై టిడిపి అభ్యర్ధి డా.వేపాడ చిరంజీవి రావు ఏకంగా 34,673 ఓట్లతో గెలుపొందారు. పోలైన ఓట్లను పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో చదువుకు న్నవా రంతా అధికార పార్టీని ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వానికి కూడా తెలిసేలా చేశారు. ఈ ఎన్నికలో రాష్ట్రప్రభుత్వానికి ఒక్క ఎమ్మె ల్సీ సీటు మాత్రమే పోయినా.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు ప్రదర్శిం చడానికి వీలు పడింది. అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకా చాలామందికి ఓట్లు రాలేదు. ఆది నుంచి ఎన్నికల సరళిపై ప్రత్యేక కథనా లు అందిస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net చెప్పినట్టుగానే ఫలితాలు రావడంతో ఈఎన్ఎస్ కథనాల పట్ల పాఠకులు, ప్రజల్లో నమ్మకం పెరిగింది.