గిరిజన యూనివర్శిటీతో విశేష పరిశోధనలు..


Ens Balu
2
దుగ్గిసాగరం
2020-09-26 19:49:49

విజయనగరం జిల్లా, రామభద్రాపురం,  సాలూరు మండలాల పరిధిలోని కొట్టక్కి, దుగ్గిసాగరం గ్రామాల వద్ద గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు కోసం ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు శనివారం స్థల పరిశీలన జరిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి,  హైయర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ  ప్రత్యేక ప్రిన్సిపాల్ సెక్రెటరీ సతీష్ చంద్ర,  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి శాసన సభ్యులు పీడిక రాజన్న దొర, అలజంగి జోగారావు, సంబంగి  వెంకట చినప్పలనాయుడు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రోఫెసర్ సర్రాజు, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి.వి.కట్టమణి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, పార్వతీపురం సబ్ కలెక్టర్ విధెహ ఖరె, ఎస్డీసి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.  విశ్వవిద్యాలయానికి ప్రతిపాదించిన సుమారు 354 ఎకరాల స్థలాన్ని దాదాపు రెండు గంటలపాటు పరిశీలించారు. మోసూరు వైపు నుంచి కూడా స్థలాన్ని సందర్శించారు. స్థలం సరిహద్దులను, భౌగోళిక పరిస్థితి, నేల స్వభావం, మ్యాపులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో గిరిజన విద్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఇక్కడే ట్రైబల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసి, తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఉప ముఖ్యమంత్రి తో పాటు, ఎమ్మెల్యేలు కోరారు.             ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో తో పాటుగా ఒడిషా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల గిరిజనులకు కూడా ఈ ప్రాంతం అందుబాటులో ఉంటుందన్నారు. చుట్టు కొండలు, గిరిజన ప్రాంతాలు ఉండటం వల్ల ఇది ఒక గిరిజన ప్రయోగశాలగా రూపొందుతుందని అన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సర్టిఫికెట్, డిప్లొమో కోర్సులను నిర్వహించే అవకాశం కూడ కలుగుతుందని చెప్పారు. గిరిజనులకు కానుకగా, ట్రైబల్ యూనివర్సిటీ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకే పాడేరులో వైద్య కళాశాల, కురుపాం లో ఇంజనీరింగ్ కళాశాల, సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.           జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్థలానికి మూడు అప్రోచ్ రోడ్లు ప్రతిపాదించామని చెప్పారు. జాతీయ రహదారికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరం మాత్రమేనని అన్నారు. యూనివర్సిటీకి అవసరమైతే మరింత స్థలాన్ని సేకరించి ఇస్తామని చెప్పారు. ఈ పర్యటనలో పలువురు తాసిల్దార్లు, డిటి లు సర్వేయర్లు, రెవిన్యూ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.