బాపట్ల జిల్లాలో జగనన్న విద్యా దీవెన పధకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి జె.రాజ్ దిబోరా పిలుపు నిచ్చారు. ఆదివారం బాపట్ల కలెక్టరేట్ లో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం క్రింద విద్యార్థులు తల్లులకు మెగా చెక్కు ను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని అమలు చేస్తుంన్నదన్నారు. కుటుంబంలో ఏoత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.బాపట్ల జిల్లాలో ఎస్.సి, ఎస్.టి.,బి.సి,ముస్లిం, క్రిస్టియన్ ,సంబంధించి న 31వేల46మందికి 26.25 కోట్ల రూపాయలు వారి తల్లుల ఖాతాలకు జమచేయడం జరుతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దస్తగిరి, జిల్లాలో సాంఘీక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.