అంగన్ వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచాలని 13 రకాల డిమాండ్లు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రా ట్యూటీ ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి. కుమార్, పి.మణి డిమాండ్ చేశారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అం గన్‌వాడీల ఉద్యమంపై తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించడాన్ని ప్రతిఒక్కరు తీవ్రంగా ఖండిరచాలనాన్నరు. పోలీసులు అక్రమ అరెస్టులను ఖం డిస్తూ సిఐటియు విశాఖజిల్లా కమటీ ఆద్వర్యంలో జగదాంబ సిఐటియు ఆఫీస్ నుండి వాచ్‌హౌస్ వరకు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించా రు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ, ఫేస్ యాప్ రద్దు చెయ్యాలని, అంగన్‌వాడీలు మార్చి 20 చలో విజయవాడ కార్యక్రమా న్ని పిలపు ఇస్తే వారిని ఎక్కడిక్కడ అరెస్టులు చేసి, పోలీసులు నిర్భదించడం పిరికిపంద చర్య అని ఆరోపించారు. తెలంగాణా కన్నా అదనం గా రూ.1000/-లు వేతనాలు పెంచుతామని సీఎం హామి ఇచ్చినా అది నీటి మీద వ్రాతగా మిగిలిందన్నారు.