గుప్పెడు సహాయం కొండంత అండ అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లాలో పలాస, ఇచ్చాపురం, ఆముదాలవలస, శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో గుప్పెడు బియ్యం కార్యక్రమం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయిం ట్ కలెక్టర్ ఎం నవీన్ ప్రారంభించారు. జిల్లాలో మెప్మా పట్టణ స్వయం సహాయక సంఘం సభ్యులు ప్రతి నేల గుప్పెడు బియ్యం పోగు చేసి జిల్లాలో ఉన్న పేదలకు, అనాధ శరణాలయాలకు ,నిరాశ్రయ గృహాలకు అందజేయాలనే సంకల్పన్ని కలెక్టర్ అభినందించారు, ఈ కార్యక్రమం జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో ఉగాది నుండి ప్రారంభం కావడం చాలా సంతషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో డిఆర్వో రాజేశ్వరీ, ఉప కలెక్టర్ జయదేవి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, డి.ఆర్.డి.ఎ, పి. డి విద్యాసాగర్, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకట్రామన్, జిల్లా వైద్య ఆరోగ్యం అధికారి బి. మీనాక్షి, డి.ఎస్.ఓ వెంకటరమణ, డి.పి.ఓ రవికుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.