28, 29 తేదీల్లో మంత్రి అనిల్ పర్యటన
Ens Balu
3
Vizianagaram
2020-09-26 20:02:56
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.పి.అనిల్ కుమార్ సెప్టెంబరు 28, 29 తేదీల్లో విజయనగరంజిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా జంఝావతి, తోటపల్లి, తారకరామ తీర్ధసాగరం ప్రాజెక్టులను సందర్శించి, ఆయా ప్రాజెక్టు పనుల పురోగతిని తెలుసుకోనున్నారు. జలవనరుల శాఖ మంత్రి 28న సాయంత్రం శ్రీకాకుళం నుండి విజయనగరం చేరుకుంటారు. రాత్రికి విజయనగరంలోనే బసచేసి 29న ఉదయం 7 గంటలకు బయలుదేరి జంఝావతి ప్రాజెక్టు సందర్శనకు వెళతారు. ఉదయం 9.30కు జంఝావతి ప్రాజెక్టు, 11 గంటలకు తోటపల్లి ప్రాజెక్టు, మధ్యాహ్నం 3.30 గంటలకు తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులను సందర్శిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం విశాఖపట్నం బయలుదేరి వెళతారు.