వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూ రక్ష రీ సర్వేలో నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పాటించి,జవాబుదారీతనంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నుండి 22 మండలాల మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీ సర్వే, స్పందన అర్జీలు పరిష్కారం ,లంక భూములు సర్వే ఐదేళ్ల పాటు లీజుకు ఇవ్వడం, సరిహద్దురాళ్లు ఏర్పాటు రాగిజావ ప్రారంభోత్సవ సన్నద్ధత, ఇత్యాది అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వేకు సంబంధించి అన్ని ప్రక్రియలు దశలవారీగా చేపట్టాలని మాన్యువల్ డేటాను డిజిటల్ డేటాగా అప్లోడ్ చేసేటప్పుడు పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి స్థాయిలోను రెవెన్యూ రికార్డుల వశీకరణ డిజిటలైజేషన్ అంశాలలో క్రాప్ చెక్కులు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించా రు.
గ్రౌండ్ ట్రూతిoగు, గ్రౌండ్ వాల్యుయేషన్, వివిధ స్థాయిలలో నోటిఫికేషన్లు జారీ, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు గుర్తింపు సరిహద్దురాళ్లు ఏర్పాటు చేయడం సమీక్షించి పనులు వేగవంతం చేసేందుకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో రక్తహీనత నివారణ చర్యల్లో భాగంగా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించను న్నారని రాగిజావ తయారీ పై విధి విధానాలను తెలిపే వీడియోను అన్ని పాఠశాలలకు పంపించడం జరిగిందన్నారు. ఆ ప్రకారం రాగిజావని సరఫరా చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిం చారు. ప్రామాణిక అంశాలను తప్పనిసరిగా పాటిస్తూ రాగిజావ సరఫరా చేయాలని సూచించారు. ఎంపీడీవోలు తమ పరిధిలోని రెండు పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. లంక భూముల సర్వేను వేగవంతం చేసి అర్హులందరికీ ఐదు సంవత్సరాలపాటు లీజుకు ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర ఆదేశించారు.
రైతుల భాగస్వామ్యం తో సరిహద్దు రాళ్లు ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. స్పందన జిల్లా ఆడిట్ బృందం కొన్ని అర్జీలు అసంపూర్తిగా పరిష్కరించాలని సూచించిందని అలా కాకుండా సంతృప్తి స్థాయిలో అర్జీల పరిష్కార సరళి నాణ్యతతో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు సంబంధించి గత ఆరు మాసాలలో 194 అర్జీలు రాష్ట్రస్థాయిలో పెండింగ్లో ఉన్నాయని వీటిపై సంబంధించిన అధికారులు ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఎస్ ఈ.లు సిహెచ్ వి కృష్ణారెడ్డి, కె చంటిబాబు గృహ నిర్మాణ సంస్థ పిడి ఎం బాబురావు, ఈఈ శ్రీనివాస్, పశుసంవర్ధకశాఖ జీడి డాక్టర్ ఏ జైపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే నాగేశ్వరరావు డీఈవో ఎం కమల కుమారి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడి కె విశాలాక్షి ఐసిడిఎస్ జిల్లా అధికారిని జీవి సత్యవాణి, డిఆర్డిఏ పిడి వి శివశం కర్ ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నా రు.