విశాఖ పెట్రోలు బంకుల్లో డిఎస్ఓ ఆకస్మిక తనిఖీలు


Ens Balu
15
Visakhapatnam
2023-03-23 09:52:52

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోలు బంకులు వినియోగదారులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని.. అలాచేయని బంకులపై చర్యలు తప్పవని డిఎస్ఓ సూర్యప్రకాశ రావు హెచ్చరించారు. గురువారం విశాఖలోని ఎంవీపిలో సుజిత ఏజెన్సీతోపాటు పలు బంకులపై ఏకకాలంలో ఆయన తన బ్రుందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ పెట్రోల్ బంక్ యాజమాన్యం  ఉచితంగా గాలి, మరుగుదొడ్లు, మంచినీరు సౌకర్యాలు కల్పించాలన్నారు. వినియోగదారులు కోరికమేరకు పెట్రోలు, డీజిల్ కొలతలు కూడా వేసి చూపించాలన్నారు. వాటికోసం ప్రత్యేకంగా కొలతపాత్రలను పెట్రోలు పైపులవద్ద ఉంచాలన్నారు. బంకు ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రిజిస్టర్లలో సంఖ్య మేరకు స్టాకు ఉండాలని, ఖచ్చితంగా ప్రతీ కొనుగోలు దారునికి బిల్లులు ఇవ్వాలన్నారు. శానిటేషన్, మరుగుదొడ్లు, ఉచిత గాలి బోర్డులు ఈబంకులో సక్రమంగా లేవనే విషయాన్ని గుర్తించినట్టు డిఎస్ఓ చెప్పారు.