స్వయం సహాయ త్రాగునీటి సంఘాల ఏర్పాటు..
Ens Balu
2
Srikakulam
2020-09-26 20:46:17
శ్రీకాకుళం జిల్లాలో స్వయం సహాయక తాగునీటి సంఘాలను ఏర్పాటుచేయాలని వ్యవసాయ శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం సాయం త్రం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వీలైనన్ని స్వయం సహాయక తాగునీటి సంఘాలను ఏర్పాటుచేయాలని, ప్రతీ రైతు భరోసా కేంద్రం పరిధిలో కనీసం 5 స్వయం సహాయక తాగునీటి సంఘాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో చిన్న, సన్నకారు రైతులు ఉండేలా చూసుకోవాలని సూచించారు. స్వయం సహాయక తాగునీటి సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.25 వేల వరకు ఆర్ధిక సహాయాన్ని అందించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. ఈ అవకాశాన్ని రైతులు అందుకునేలా చర్యలు తీసుకోవాలని, జిల్లావ్యాప్తంగా స్వయం సహాయక తాగునీటి సంఘాలు ఉండేలా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, వ్యవసాయ పరిశోధన అధికారి పి.వి.సత్యనారాయణ, డా. యస్.వి.యస్.నేతాజీ, శాస్త్రవేత్తల బృందం, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.