కోదండరామస్వామివారి ఆలయంలో కవి సమ్మేళనం


Ens Balu
11
Vontimitta Kodanda Rama Swamy Temple
2023-03-29 02:41:15

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని  టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల  ఆధ్వర్యంలో మార్చి 30వ తేదీ పోతన భాగవతం అంశంపై  కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.  మార్చి 31వ తేదీ  శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది.  ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జియస్ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షతన "పోతన భాగవతం''పై  ప్రముఖ పండితులు ఎం.నారాయణ రెడ్డి - రుక్మిణి సందేశం , డా.బి.గోపాలకృష్ణ శాస్త్రి - శ్రీరామ జననం, డా.కె.సుమన- సీతారామ కళ్యాణం,  పి.శంకర్ - భక్తి రసం,  వి.చిన్నయ్య - కుచేలోపాఖ్యానం,  ఎం.లోకనాధం - శరణాగతి తత్వం  అంశాలపై కవి సమ్మేళనం జరుగుతుంది.

అదేవిధంగా మార్చి 31వ తేదీ  టీటీడీ అర్చక శిక్షణ కోఆర్డినేటర్ డా.హేమంత్ కుమార్ అధ్యక్షతన  ''శ్రీరామ పాదుకా పట్టాభిషేకం'' పై
 ఎల్.జగన్నాథ శాస్త్రి - గడియారం వెంకట శేషశాస్త్రి రామాయణం,  ఎం.మల్లికార్జున రెడ్డి -  రామాయణ కల్పవృక్షం,  వై. మధుసూదన్ -  శ్రీ రంగనాథ రామాయణం, డా.సి.శివా రెడ్డి-శ్రీమద్ వాల్మీకి రామాయణం,   యు.భరత్ శర్మ - చంపూ రామాయణం, డా. పి.నీలవేణి - మొల్ల రామాయణం అంశాలపై కవి సమ్మేళనం నిర్వహిస్తారు.  శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా మార్చి 31 నుండి ఏప్రిల్ 8వ తేదీ  వరకు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.