శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి


Ens Balu
19
Tirupati
2023-03-30 13:59:47


శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.  తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఊంజల్‌ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.  సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు  శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠం నుండి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకొని విమానప్రదక్షిణగా వచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తరువాత శ్రీరామ జన్మపు రాణం, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ,  అనంతరం ఉత్సవ మూర్తులను వాహన మండ పానికి వేంచేపు చేస్తారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.   ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నాగరత్న, ఏఈవో  మోహన్, సూపరిం టెండెంట్‌ రమేష్‌ కుమార్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.