ట్రైబల్ సెల్ బలోపేతం చేసి రోగులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుం బ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖా మరియు జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ తో విజయవా డ లో క్యాంపు కార్యాలయం నుండి గిరిజన సెల్ కు సంబంధించి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడద ల.ర జని మాట్లాడుతూ గిరిజన సెల్ ను బలోపేతం చేసి రోగులకు సేవలను మరింత బలోపేతం చేయాలన్నారు. పాడేరు, అరుకు లో కొత్తగా బ్లడ్ బ్యాంక్ లు నిర్మించాలని ఆదేశించారు. కెజిహెచ్ లో NICU ను అభివృద్ధి చేసి, అదనపు SNCU ను నిర్మించాలన్నారు.
జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ గిరిజన సెల్ కు ఖరీదైన మందులను కొనుగోలుకు, కాంట్రాస్ట్ స్కాన్ చేయడానికి నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. గిరిజన సెల్ మరియు గిరిజన రోగుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా అంబులెన్సు ల సంఖ్యను పెంచాలన్నారు. అరుదైన రక్త నమూనాలకు సంబంధించిన సమస్యలను మంత్రికి వివరించారు. ఈ కాన్ఫరెన్సులో జిల్లా నుండి కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. అశోక్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జగదీశ్వర రావు, డిసిహెచ్ఎస్ డా. రమేష్ కిషోర్ , వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.