గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కనింగ్ కేంద్రాల పై చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి స్పష్టం చేశారు. శుక్రవారం తన ఛాంబర్ లో జిల్లా స్థాయి అడ్వజరి కమిటీ సమావేశం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అధ్యక్షతన గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ చట్టం 1994 అమలుపై నియమించిన జిల్లా స్థాయి మరియు ఉప జిల్లా స్థాయి అడ్వయజరి కమిటీ సమావే శం నిర్వహించారు. గర్భస్థ పిండ పరిస్థితి,వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించవలసినయంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని తప్పక అమలు చేస్తామని కమిటీ సబ్యులు చెప్పారు, ఆడపిల్ల పుట్టుకలు తక్కువగా నున్న మండలాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం , ప్రాగ్రామ్ అధికారులకు స్కానింగ్ సెంటర్ లను విధిగా పర్యవేక్షించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి ఆదేశించారు. ప్రతి స్కాన్ సెంటర్ లో టారిఫ్ బోర్డ్ లను విదిగా ప్రదర్శించాలని ఆదేశించారు. పి.సి.పి.ఎన్.డి.టి చట్టం పై సహేలి, సఖి గ్రూప్ ల ద్వారా ప్రజలలో విస్తృత మైన ప్రచారం చేయాలని తెలియజేశారు.
సంతానోత్పత్తి కోసం ఏ ఆసుపత్రి వారు అయిన నమోదు చేసుకోకుండా ఏఆర్టీ పరీక్షలు జరిపినట్లైనా తగు చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ అనుసరించి 31.03.2023 తేదీ లోపుగా జిల్లా లో ఉన్నటువంటి అన్నీ నర్సింగ్ హోమ్లు/ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్లు, డెంటల్ క్లినిక్లు, ఫిజియోథెరఫీ క్లినిక్లు విదిగా జిల్లా రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో www.clinicalesttact.ap.gov.inఅప్లోడు చేసుకోవాలని జిల్లా అడ్వయిజరీ కమిటీ మీటింగ్లో తెలియచేసారు. దీనిపై గతంలో పలు ధఫాలుగా పత్రిక ప్రకటన ఇవ్వటం జరిగినది. స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ కొరకు www.pcpndt.ap.gov.inనందు అప్లోడు చేసుకోవలేనని తెలియజేసారు . ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోని యెడల చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని తెలిపారు.
చట్టబద్ద గర్భస్రావములు కమిటీ మీటింగ్ లో ఏ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులనందు గర్భస్రావములు చేయవలేనన్న చట్టం ప్రకారం నమోదు చేసుకొని ఉండవలెను. లేనిచో ఆ యాక్ట్ ప్రకారం చట్ట రీత్యా తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమం లో ఉప జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి, జిల్లా టీకా అధియాకారి, ఘోష ఆసుపత్రి నుండి జిల్లా స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల వైద్యనిపుణులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుండి రేడియోలాజిస్ట్, పేతలజిస్ట్, మరియు ఐ.ఎం.ఏ ప్రసిడెంట్, నేచర స్వచ్చంద సంస్థ వారు, డెమో సెక్షన్ సభ్యులు పాల్గొన్నారు.