అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 30 నుంచి మే 6వ తేదీ వరకూ అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏ ర్పాట్లు చేస్తున్నట్టు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం అన్నరంలో మీడియా కి ప్రకటన విడుదల చేశారు. స్వామివారి ఉత్సవాల్లో భక్తుల కోసం దేవస్థానంలో తిలకించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయా లని కూడా నిర్ణయించినట్టు తెలియజేశారు. దానికోసం కూచిపూడి నృత్యం, భరతనా ట్యం, భక్తి కీర్తనలు, హరికథలు, బుర్రకథ, నాటికలు, నాట కములు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆశక్తిగల కళాకారులు, బృందాలు పాల్గొనవచ్చునని వివరించారు. ఈ ప్రకటన వెలువడి 7 రోజులలో దేవస్థానం పి.అర్. ఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, మరిన్ని వివరాలకు 6301092359 లో సంప్రదించా లని ఈఓ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.