విశాఖజిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 50 మందికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఈ సంఖ్యను సోమవారం నుంచి 200కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జ్వరం, దగ్గు, తలనొప్పి లక్షణాలు ఉంటే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వర రావు తెలిపారు. ఈ మేరకు అన్ని పీహెచ్సీల వైద్యాధికారులకు సమాచారం అందించారు. మరో వైపు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు సంబం ధించి కూడా బ్లీచింగ్ చైన్ ఎప్పటి కప్పుడు ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించా లని, బయటకు వెళ్లేటపుడు, తిరిగి ఇంటికి వచ్చిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవాలని, నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని సూచిస్తున్నారు. ఎక్కువ మంది ఉండే చోటకు వెళ్లడం శ్రేయస్కరం కాదంటున్నారు.