విజయనగరం జిల్లాలోని చేపల వేట నిషేధం విధించే సమయంలో మత్స్యకార భరోసా అందించేందుకు ఏప్రిల్ 17న ఒక్కరోజే అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో లబ్దిదారులను గుర్తించే కార్యక్రమం చేపడుతున్నట్టు జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలి యజేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వేట నిషేధభృతి పధకం క్రింద వివరాలు నమోదు చేసే సిబ్బందికి మత్స్యకారులు సంఘం సభ్యులు తమ పూర్తివివరాలు తెలియజేయాలని ఆమె సూచించారు. లబ్దిదారులు ముఖ్యంగా ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ (ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తో లింక్ ఉన్నది), బోటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, వాలిడ్ ఫిషింగ్ లైసెన్స్ తప్ప నిసరి తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ఈ సమాచారాన్ని అందించి వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. ఇప్పటికే ఎన్యూమరేటర్లకు ఆ దేశాలు జారీచేసినట్టు ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి మీడియాకి వివరించారు.