ఘనంగా ఐఎస్‌టీడీ వ్యవస్థాపక దినోత్సవం


Ens Balu
23
Visakhapatnam
2023-04-11 13:12:32

ఐఎస్‌టీడీ  విశాఖపట్నం చాప్టర్‌ 53వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో సీఎండీ అతుల్‌ భట్‌ సమక్షంలో ఈ కార్య క్రమాన్ని చేపట్టారు.  శిక్షణ సంబంధిత కార్యకలాపాలను ప్రోత్సహించడంలో కృషి చేసినందుకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌  కె.శ్రీనివాస రావును ఘనంగా సత్కరించారు.  అలాగే సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో  ఆ సంస్థ డైరెక్టర్‌ డి.సత్యనారాయణ, ఇతర సభ్యులతో కలిసి వ్యవస్థాపక దినోత్సవాన్ని చేపట్టారు. ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఫర్‌ డ్రోన్‌ టెక్నాలజీ, ఆంధ్రా యూనివర్శిటీ, సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌, గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలోనూ ఈ దినోత్సవాన్ని జరిపారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో విశాఖపట్నం చాప్టర్‌ సభ్యులంతా వ్యవస్థాపక దినోత్సవాన్ని మరింత వేడుకగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఊఎస్‌ఈఐ ఫార్మాస్యూటికల్స్‌ ఐటీ హెడ్‌ జోసెఫ్‌ కిరణ్‌ కుమార్‌ ముఖ్య వక్తగా హాజరయ్యారు. గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రిన్సి పాల్‌  కె.వి.రమణ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విభాగాధిపతి మధు కుమార్‌లను తమ తమ సంస్థల్లో ఐఎస్‌టీడీ విద్యార్థి చాప్టర్‌లను ప్రారం భించినందుకు ఈ సందర్భంగా సత్కరించారు. 

విశాఖపట్నం చాప్టర్‌ నుండి ఈ-జర్నల్‌ ప్రగ్యా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థలోని పలువురు సభ్యులు మాట్లాడుతూ విశాఖపట్నం చాప్టర్‌లో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థల నుండి 600 మందికి పైగా సభ్యులు ఐఎస్‌టీడీలో ఉన్నారన్నారు. హెచ్‌ఆర్‌ రంగంలోని ప్రముఖు ల భాగస్వామ్యం ఉందన్నారు. భారత కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన ఈ జాతీయ స్థాయి ప్రొఫెషనల్‌ బాడీ డిప్లొమా కోర్సులను నిర్వ హించడం, హెచ్‌ఆర్‌ సోదరభావం కోసం ఈవెంట్‌లు, కార్యకలాపాలను నిర్వహించడంలో విజయవంతమవుతోందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఐఎస్‌టీడీ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎన్‌.సాంబశివరావు, చాప్టర్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఓఆర్‌ఎం రావు, గౌరవ కార్యదర్శి డాక్టర్‌ హేమ యడవల్లి, ఇతర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, విద్యార్థి విభాగం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.