అనకాపల్లిలోని ప్రముఖ వ్యాపారవేత్త, యువతకు రోల్ మోడల్.. సేవాబానికి నిలెవెత్తు చిరునామా అయిన ముత్యాల వెంకటేశ్వర్రావు (ఎంవీఆ ర్)పై ఒకవర్గం కావాలనే బురదచల్లే అసత్య ప్రచారాలకు తెరలేపింది.. అడిగింత మొత్తం ఇవ్వకపోతే అభివృద్ది విషయంలో ఆయన చేసిన ప్రకటనలను వ్యంగ్యంగా చిత్రీకరించే చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. వాస్తవానికి ఎంవీఆర్ కి ఒక్క అనకాపల్లి జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఆయనను పొలిటికల్ గా ప్రమోట్ చేసేందుకు, దానికి అయ్యే ఖర్చును అడ్డంగా లాగేందుకు కొన్ని పత్రికలు, మీడియా పనిగట్టుకొని తేడా ప్రచారాలకు దిగుతున్నాయి. తొలుత సామాజిక సేవగా బావించి చాలా చిన్న చిన్న పత్రికలు, ఛానళ్లకు చేయూత అందించిన ఆయన వాస్తవాలు తెలుసుకొని నిజంగా పనిచేసే మీడియా సంస్థలను, జర్నలిస్టులను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. దానితో తేడా మీడియాకు అది మింగుడు పడలేదు. వెంటనే గతంలో ఈయన చేసిన ప్రచారాలను తప్పుడుగా చిత్రీకరించే వంటా, వార్పులు మొదలెట్టారు.