విజెఎఫ్ ప్రెస్ క్లబ్ మరో విజయనగరం ప్రెస్ క్లబ్ కానుందా


Ens Balu
47
Visakhapatnam
2023-04-20 00:58:44

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) ప్రెస్ క్లబ్ కూడా మరో విజయనగరం ప్రెస్ క్లబ్ కానుందా..? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. దానికి కారణం 2012 కార్యవర్గమే కోర్టు కేసుల నెపంతో అప్రజాస్వామికంగా నేటి వరకూ అనధికారికంగా ఉండిపోవడం, ఈ మధ్యకాలంలో ఒక్క సారి కూడా సర్వసభ్య సమావేశం పెట్టకపోవడం, కనీసం కోర్టుకేసుల విషయం కూడా సభ్యులకు అధికారికంగా తెలియజేయకపోవడం, ఈ చ ట్టవ్యతిరేక విధానాలపై జిల్లాకలెక్టర్ డా.మల్లిఖార్జున ముగ్గురు అధికారుల బృందం కమిటీ వేయడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. విజయనగరం జిల్లా ప్రెస్ క్లబ్ లోనూ ఇదే తరహా వ్యవహారం, అవినీతి జరగడంతో అక్కడి జిల్లా కలెక్టర్ ప్రెస్ క్లబ్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నేరుగా కలెక్టర్ సభ్యత్వాలు ఇచ్చారు. విశేషం ఏంటంటే ప్రస్తుతం కాలం చెల్లిన విజెఎఫ్ కార్యవర్గం కూడా అనధికారికంగా స భ్యులకు సభ్యత్వాలు 3రోజుల పాటు చేసిన రెవిన్యువల్స్ పైనా కలెక్టర్ విచారణచేపట్టే అవకాశాలున్నాయి.