VJFలెక్కల్లో బొక్కలు బయటకొస్తే కోశాధికారికి చుక్కలే


Ens Balu
197
Visakhapatnam
2023-04-21 00:37:26

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో గత 11ఏళ్లుగా చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు చేపడుతున్న కాలంచెల్లిన కార్యవర్గం చేసిన ఖర్చులకు కోశాధికారి లెక్కలు ప్రభుత్వానికి సమర్పించాల్సి వుంటుంది. ఏమాత్రం ఖర్చులు పెట్టిన లెక్కలకు బొక్కలు ఉంటే కోశాధికారికి చుక్కలు కన పడటం ఖాయంగా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం కాలంచెల్లిపోయినా..పరిపాలన చేశారు కనుక 11ఏళ్లకు ఆడిట్ రిపోర్టులు, ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్, ఆసమయంలో వచ్చిన విరాళాలు, 12ఏ, 80జి క్రింద ఇచ్చిన మినహాయింపులు, 11ఏళ్ల ఫర్మ్ రెవెన్యువల్స్, సర్వసభ్య సమావేశం మి నిట్స్(ఒకవేళ పెట్టిఉంటే) ఓచర్లు, బ్యాలెన్స్ షీట్లు, ఇలా లెక్కలన్నీ కోశాధికారి జిల్లా కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ ముందు ఉంచా ల్సిందే. అనధికార కార్యవర్గం పలుకుబడిని వినియోగించి 11ఏళ్లకు ఒకేసారి ఆడిట్ రిపోర్టులను తీసుకు రాగలిగినా.. ప్రతీఏటా వేయాల్సిన ఆ న్ లైన్ ఐటీ రిటర్న్స్ మాత్రం ఒకేసారి చేయడం పైనున్న దేవుడి తరం కూడాకాదు. సో బొక్కలు బయటపడటం ఫిక్స్..!