భోగాపురం ఎయిర్‌పోర్టు రాష్ట్రానికి ప్ర‌తిష్టాత్మ‌కం


Ens Balu
20
Vizianagaram
2023-04-24 10:28:40

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఉత్త‌రాంధ్ర‌కే కాకుండా, రాష్ట్రానికే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారా య‌ణ పేర్కొన్నారు. మే 3వ తేదీన ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా జ‌రిగే ఎయిర్‌పోర్టు శంకుస్థాప‌నా కార్య‌క్ర‌మానికి ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయా ల‌ని జిల్లా అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. విమానాశ్ర‌య శంకుస్థాప‌న, ముఖ్య‌మంత్రి బ‌హిరంగ స‌భ నిర్వ‌హ‌ణ‌కు అధికార యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్ల‌పై, వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌మ‌న్వ‌య‌ స‌మావేశాన్ని నిర్వ‌ హించారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను, ఈ సంద‌ర్భంగా వివిధ శాఖ‌ల అ ధికారుల‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను వివ‌రించారు.

              ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి, ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వం తం చేయాల‌న్నారు. హెలీప్యాడ్‌, భూమి పూజ‌, పైలాన్ ఆవిష్క‌ర‌ణ‌, బ‌హిరంగ స‌భ వేదిక‌ల వ‌ద్ద ప్ర‌త్యేకాధికారుల‌ను నియ‌మించి, వారికి బాధ్య‌ త‌లు అప్ప‌గించాల‌ని సూచించారు. ప‌టిష్ట బందోబ‌స్తు నిర్వ‌హించాల‌ని జిల్లా ఎస్‌పిని ఆదేశించారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని తిల‌కించేం దుకు ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తార‌ని అన్నారు. వారంతా స‌భ‌కు వ‌చ్చి, తిరిగి ఇంటికి వెళ్లేవ‌ర‌కు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ముఖ్యంగా త్రాగునీరు, మ‌జ్జిగ విస్తృతంగా పంపిణీ చేయాల‌న్నారు. వాట‌ర్ ట్యాంక‌ర్ల‌ను కూడా సిద్దంగా ఉంచాల‌న్నారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఉప‌యోగించేందుకు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా నాలుగు 104 వాహ‌నాల‌ను కూడా సిద్దం చేయాల‌న్నారు. 

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న జిల్లాలో ఆరోజు ఉద‌యం 10.30కు ప్రారంభ‌మై, మ‌ధ్యాహ్నం 12.30 క‌ల్లా ముగుస్తుంద‌ని చెప్పారు. ప్ర‌తీఒక్క‌రూ అప్ర‌ మ‌త్తంగా ఉండి, త‌మ‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించి, సిఎం ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి కోరారు. ఈ స‌మావేశంలో జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎంఎల్‌సి ఇందుకూరి ర‌ఘురాజు, ఎంఎల్ఏ శంబంగి వెం క‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, ఎస్‌పి దీపిక‌, జెసి మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.