దోమల నిర్మూలన అందరి ప్రధమ కర్తవ్యం


Ens Balu
8
Visakhapatnam
2023-04-25 09:35:37

మలేరియా వ్యాప్తికి కారణమైన  దోమలు లేకుండా చేయాలని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. హేమంత్ పిలుపునిచ్చారు.  ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆయన జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దోమలు పెరగడానికి కార ణం మురికి కుంటలు, ఇళ్లలో నీరు నిల్వ ఉంచడమేనని చెప్పారు.  పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం కాలువల్లో మందులు చల్లడం, ఫాగిం గ్, వారానికి ఒకరోజు డ్రై డే పాటించాలని చెప్పారు.  వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖలకు అందరూ సహకరించాలన్నారు. దోమల వల్లనే మలేరి యా డెంగ్యూ మొదలైన వ్యాధులు వ్యాపిస్తాయని చెప్పారు. ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం నుంచి బయలుదేరి నెహ్రూ చౌక్ బాలాజీ రావు మార్కెట్ మీదుగా తిరిగి ఎన్టీఆర్ స్టేడియం కు చేరుకున్నది.  ఈ ర్యాలీలో అడిషనల్ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శారదాబాయి జిల్లా మలేరియా అధికా రి డాక్టర్ ఉమామహేశ్వరరావు, మలేరియా శాఖ, జీవీఎంసీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు  పాల్గొన్నారు.