జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ లో భాగంగా మలేరియా, డెంగ్యూ తదితర కీటక జనిత వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు అధికారు లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నందు ప్రపంచ మలేరియా దినోత్సవా న్ని పురస్కరించుకుని వివిధ శాఖల అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించి కీటక జనిత వ్యాధులు, మలేరియా డెంగ్యూ తదితర వ్యాధుల నియంత్రణ చర్యల పై సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నమోదైనన ఏడు డెంగ్యూ కేసులు పట్ల సత్వరమే స్పందిస్తూ నియంత్రణ కొరకు చికిత్సలు బలోపేతం చేయా లన్నారు. దోమల లార్వాలు ఉత్పత్తి అయ్యే మురికి కుంటలు, పరిసరా లను గుర్తించడంతోపాటు ప్రతి శుక్రవారం డ్రైడే పటిష్టంగా చేపట్టాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్స్ స్ప్రేయింగ్ కార్యక్రమాల ద్వారా చేపడుతూ ఆరోగ్యకర సమాజస్థాప న దిశగా పాటుపడాలన్నారు.