భూ సర్వే పనులు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చెయ్యాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు,మండల తాసిల్దారులను జాయింట్ కలెక్టర్ కే ఎస్ విశ్వనాథన్ ఆదేశించారు.మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తాసిల్దార్లుతో జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్ రెవిన్యూ శాఖ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మీసేవ, ఏపీ సేవ, స్పందన ద్వారా ప్రజల నుంచి వచ్చే దరఖాస్థులపై సమీక్షించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఏపీఐఐసి, ఎన్ హెచ్ 16, రైల్వేస్ భూములకు సంబంధించి మ్యుటేషన్ పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. , రీ సర్వే పనులు నిర్ణీత కాల వ్యవధి లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈనెల 26 నుండి మే25 వరకు నెల రోజులు పాటు మండల తాసిల్దార్ కార్యాలయంలో సింగిల్ విండో సేవలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, దీని ద్వారా ప్రజలు భూపట్టాలకు సంబంధించి సవరణలు చేసుకోవచ్చన్నారు. గాజువాక హౌసింగ్ కి సంబంధించి జీవో నెంబరు 301 మరియు,388 పై ప్రజలకు సచివాలయ సిబ్బంది ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు . పంపిణీకి సిద్ధంగా ఉన్న భూ పట్టాలను ప్రజలకు వెంటనే అందించాలన్నారు . సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేసి భూములకు సంబందించిన పనులు , స్పందన వినతులు పరిష్కరించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్వో శ్రీనివాసమూర్తి , భీమిలి ఆర్డిఓ భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే విజయ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఈశ్వరరావు,ఎస్ డి సీలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.