మిస్సింగ్ కేసులపై తక్షణమే దృష్టిసారించండి


Ens Balu
6
Anakapalle
2023-04-25 12:17:48

మిస్సింగ్ కేసులు, సాధారణ మరణాలు (174 సి.ఆర్.పి.సి), ఫోక్షో కేసులను పూర్తిస్థాయిలో సమీక్షించి చర్యలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మురళీ కృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించి, దర్యాప్తు లో ఉన్న కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోక్షో కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి నిర్ణీత సమ యంలో చార్జ్ సీట్ వేయాలన్నారు. గంజాయి కేసుల్లో ఉన్న నిందితులు పై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం ద్వారా పీ.డీ యాక్టు నమోదు చేయ డానికి చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ, తగాదాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువ నమోదు చేయాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు తో పాటు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం మరియు రోడ్డు భద్రత నియమాలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.వేసవి కారణంగా రాత్రి సమయాలలో వేడిని తట్టుకోలేక చాలామంది ప్రజలు ఆరుబయట నిద్రిం చటం, ఇంటి తలుపులు తెరిచి ఆదమరిచి నిద్రించడం జరుగుతోందన్నారు. దొంగలు అదునుగా తీసుకొని చోరీలకు పాల్పడే అవకాశం ఉ న్నందున ప్రజలు తగు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి పగలు గస్తీలలో అనుమానాస్పద వ్యక్తుల ను ఫిన్స్ పరికరం ద్వారా తనిఖీ చేస్తూ, సంబంధిత వ్యక్తికి నేరచరిత్ర తెలుసుకోవడం ద్వారా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

స్పందన ఫిర్యాదు దారుల సమస్యలు ప్రాముఖ్యతనిచ్చి, నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దత్తత గ్రామాల కానిస్టేబుల్స్, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల గ్రామాల నుండి వచ్చే సమాచారంపై అధికారులు త్వరితగతిన స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) బి.విజయ భాస్కర్, అదనపు ఎస్పీ (క్రైమ్స్)  పి.సత్యనారాయణ రావు, అనకా పల్లి సబ్ డివిజన్ డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ  పి.శ్రీనివాసరావు, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ కె.ప్రవీణ్ కుమార్, ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, లక్ష్మణ్ మూర్తి, అప్పలనాయుడు, సతీష్ ఎస్సైలు  భీమరాజు, రఘువర్మ   జిల్లా సిఐలు , ఎస్సైలు ఈసమా వేశంలో పాల్గొన్నారు.