రాజకీయాలను తలపిస్తున్న VJF ప్రెస్ క్లబ్ ఎన్నికలు


Ens Balu
253
Visakhapatnam
2023-05-12 06:53:51

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) ఎన్నికలు ప్రత్యక్ష రాజకీయాలను తలపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు అధికారపార్టీ చేపట్టిన ట్టు మెరుపుల కార్యక్రమాలు చేపడుతున్నారు. 12ఏళ్లపాటు సొసైటీ చట్టానికి విరుద్ధంగా, ఒక్క సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించకుండా కోర్టు కేసుల నెపంతో కాలం గడిపేసిన కాలంచెల్లిన కార్యవర్గం ఎన్నికల ప్రకటించగానే అభివృద్ధి కార్యక్రమాలకు తెరలేపారు. ఆగమేఘాలపై డాబాగార్డెన్స్ లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ కు ఫైబర్ బోర్డులు పెట్టించడం, సీతమ్మధారలోని నార్ల వెంకటేశ్వర భవన్ కి మరమ్మతులు చేపట్టి..డిజి టల్ డయాగ్రామ్ లను వాట్సాప్ ప్రచారం చేయడం మొదలెట్టారు. నిజంగా విజెఎఫ్ పై అనధికార కార్యవర్గానికి అంత సచ్చీలతే వుంటే పద వీకాలంలో ఎప్పుడైనా చేపట్టవచ్చు. కానీ అనధికార కార్యవర్గం చేపడుతున్న అప్రజాస్వామిక వ్యవహారాలను సంఘం సభ్యులే తిరుగుబావుటా ప్రకటించి ఎదురు తిరిగిన వెంటనే చేయడం మొదలు పెట్టారంటే ఈ అనధికార కార్యవర్గానికి ఇంకా పదవులపై ఎంత వ్యామోహం ఉందో తెలుసుకోవచ్చు. నిజంగా ఈ అభివృది ఆదిలోనే చేసి ఉంటే ఇప్పటికే విజెఎఫ్ ఆస్తులు, ఆదాయం రెట్టింపు అయ్యేవి ఈ 12ఏళ్లలలో.  గత పాలక వర్గాలు విజెఎఫ్ ఆస్తులను, ఆదాయాలను పెంచితే..ఈ పాలక వర్గం మాత్రం అప్పులను మిగిల్చింది. వాస్తవానికి డాబాగార్డెన్స్, సీతమ్మధారలోని నార్లవెంకటేశ్వర భవన్ లోని గ్రౌండ్ ఫ్లోర్అద్దెలు, పక్కనే వున్న షాపుల ఆద్దెల ద్వారా ఏడాదికి రూ.లక్షల్లోనే ఆదాయం వస్తుంది. పైన ఉన్న అంతస్తు అద్దెకిస్తే.. దాని ద్వారా మరికొంత అద్దెరూపంలో ఆదాయం వచ్చేది. కానీ కార్యవర్గంలోని ఒకరి సౌలభ్యం కోసం అక్కడ డాన్సు శిక్షణకు, సొంత కార్యక్రమాలకు దానిని వినియోగించుకుంటున్నారు.

ఇంత కాలంలేని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే ఎందుకు చేయిస్తున్నారని విజెఎఫ్ సభ్యులు ప్రశ్నిస్తే.. ఆ ఒక్కటీ అడక్కూడదు మీరం తా... ఏం 12ఏళ్ల పాటు, కోర్టుకేసుల నెపంతో మోసం చేసినా, కనీసం సర్వసభ్య సమావేశాలు పెట్టకపోయినా, ప్రతీ ఏటా తమ ప్రచారం కోసం కార్యక్రమాలు చేస్తున్నా.. అప్పుడు మాట్లాడని వారు ఇపుడెందుకు మాట్లాడుతున్నాయని ఎదురుదాడి చేస్తున్నారు ప్రస్తుతం కాలంచెల్లిన కార్యవర్గ సభ్యులు. మేం చేసిందే కార్యక్రమం, మేము పెట్టాలనుకుంటే సర్వసభ్య సమావేశం పెడతాం..ఒక వేళ అలా సొసైటీ నిబంధనలు పాటించకపోయినా.. మా తప్పులను వెనుకేసుకు వచ్చే సీనియర్ జర్నలిస్టులు, సానుభూతి పరులు మా వెనుకే పెద్ద సంఖ్యలోనే ఉన్నారనే ప్రచారం సైతం తమ వెనునున్నవారితో సోషల్ మీడియాలో ఊదర గొడుతున్నారు.  ఇక దాతల నుంచి వచ్చిన విరాళాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు.. కనీసం విజెఎఫ్ పై భవనాల ద్వారా వచ్చిన అద్దెలు, ఆదాయాలు ఏమయ్యాయో అసలే తెలీదు.. కానీ 12ఏళ్లలో విహార యాత్రలు మాత్రం అనధికార కార్యవర్గం క్రమం తప్పకుండా చేస్తూ వస్తున్నది ఈ అధికారం లేని పాలకవర్గం. సమయం దాటిపోయినా.. కోర్టు కేసుల విషయంలో ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కని వారు కోర్టు 2 కేసులను ఒకటి 2016లోనూ, మరొకటి 2019లో డిఫాల్ట్ డిస్ మిస్ చేస్తే..తీర్పు విజెఎఫ్ కి అనుకూలంగా వచ్చిందని సభ్యులను దారుణంగా మభ్యపెట్టారంటే వీరి పదవీ కాంక్షకు కోర్టు కేసులను కూడా ఏవిధంగా వాడుకున్నారో చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. ఇదంతా రాజకీయపార్టీలు చేస్తున్న కార్యక్రమాల కంటే దారుణంగా చేపడుతుండటం విశేషం.

ఏ కార్యవర్గం విజెఎఫ్ ను అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా దానిని సభ్యులంతా స్వాగతించాలి.. అభినందించాలి.. కానీ విజెఎఫ్ పై వచ్చిన ఆదాయాన్ని దాతల దగ్గర నుంచి సేకరించిన విరాళాలను మొత్తం ఖర్చులు క్రింద చూపించేయడంతోపాటు, ఇంకా అప్పులు చూపించడమే ఇపుడు సభ్యులందరికీ చిర్రెత్తుకొస్తున్నది. ఆ విషయాన్నే సర్వసభ్యసమావేశం పెట్టి ఆదాయ వ్యవయాల లెక్కలు చెప్పమంటే మాత్రం ప్రస్తుత అనధికార కార్యవర్గం ఏమీ పట్టనట్టు..అసలు అలాంటివేమీ తమకు తెలియనట్టు.. ఇంకా మాట్లాడితే ఎందుకు సర్వసభ్య సమావేశాలు పెట్టాలన్నట్టు బీరాలు పోతున్నారు. తాము చేసింది అభివృద్ధి కాదా..సభ్యుల సంక్షేమం కోసమే అప్పులు చేశాం తప్పితే తమ సొంత ప్రయోజనాలకా అంటూ ఎదురుదాడి చేస్తోంది. విషయాన్ని, సదకు అప్రజాస్వామిక కార్యవర్గం చేస్తున్న తేడా తనాన్ని సభ్యులకు తెలిసేలా చైతన్యం చేస్తున్న తరుణంలో కొందరి చేత ఫోన్లు చేయించి తిట్టించడం, మరికొందరితో సోషల్ మీడియాలో వార్నింగ్ ఇప్పించడం, కులసంఘాలను ఈ విజెఎఫ్ ఎన్నికల్లోకి దించి వారికి ఫోన్లు చేసి..ఎదురు తిరిగేవారందరికీ కాలో చేయో తీయించేస్తామని, వారి అంతు చూస్తామని చెప్పడం తదితర వ్యవహారాలన్నీ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. అసలు ఇంత దారుణంగా విజెఎఫ్ పరువు తీసిన ఈకాలంచెల్లిన కార్యవర్గానికి, 12ఏళ్లపాటు ఏకబిగిన సొసైటీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించాలని మెజారిటీ సభ్యులు ముక్తకంఠంతో కోరుతున్నారు. విజెఎఫ్ అనధికార పాలకవర్గం వ్యవహార శైలిపై త్రిసభ్య కమిటీ వేసిన జిల్లా కలెక్టర్ నివేదిక ను కూడా ప్రకటించే అవకాశం వుంది. చూడాలి ఏం జరుగుతుందనేది..!