విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సోమవారం 122 వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఇతర జిల్లాశాఖల అధికారులతో పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు, విద్యుత్ శాఖకు సంబంధించి 01, డి.సి. హె చ్.ఎస్.-1, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి 01, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు 06, గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 10, జి ల్లా పంచాయతీ అధికారికి 06, గృహనిర్మాణంకు సంబంధించి 12, మునిసిపల్ సమస్యలపై 5, రెవిన్యూకు సంబంధించి 80 వినతులు అం దాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీపెట్టుకున్న ప్రతీ ఒక్కరికీ ఆయా ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి నిర్ధిష్టమైన సమాచా రం అందాలన్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలన్నారు. అర్జీదారులను పదే పదే జిల్లాశాఖల కార్యాలయాల చుట్టూ తిప్ప రాదన్నారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌లు సూర్యనారాయణ, పద్మ లీల, బి.ఎస్.ఎన్.దొర తదితరులు కూడా స్పందనలో వినతులు స్వీకరణ చేపట్టారు.