సత్వరమే అక్రిడిటేషన్ దరఖాస్తులు సమర్పించండి


L.G.Naidu
18
Visakhapatnam
2023-05-16 01:48:26

విశాఖజిల్లాలో  పనిచేస్తున్న అర్హులైన పత్రికా, మీడియా ప్రతినిధులు www.ipr.ap.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా అక్రిడిటేషన్ ధరఖాస్తులను అఫ్లోడ్ చేసి సదరు కాఫీలను జిల్లా  పౌరసంబంధాల కార్యాలయంలో సమర్పించవలసినదిగా ఉప సంచాలకులు ఒక ప్రకటనలో కోరారు.  ఇదే విషయమై గతనెల 28న ప్రకటన చేశామని పేర్కొన్నారు. మీడియా సంస్థలు ఎంత త్వరగా దరఖాస్తులు సమర్పిస్తే అంతే త్వరగా నూతన అక్రిడిటేషన్ కార్డులు జారీకి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం జీఓలో పొందుపరచిన విధంగా అనుబంధ పత్రాలు, సదరు వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు.  వీలైనంత త్వరగామీడియా సంస్థలు ఈ ప్రక్రియ పూర్తిచే యా లని కోరారు. ఇంకా ఎవరి మీడియా సంస్థలైనా సమాచారశాఖ వెబ్ సైట్ లో కనిపించకపోతే సంస్థ నుంచి అభ్యర్ధన లేఖలు సమర్పిస్తే వారి మీడియా సంస్థలను రిజి స్ట్రేషన్ చేపడతామన్నారు. ఆన్ లైన్ లో అఫ్లోడ్ చేసి,  ధరఖాస్తులను డిపిఆర్వో కార్యాలయంలో అందజేయాలని ఆ ప్రకటనలో కోరారు.