వృధా నీటి నిర్మూలనే దోమల నివారణకు మార్గం


Ens Balu
9
Srikakulam
2023-05-16 07:12:56

వృధా నీటి నిర్మూలన ద్వారా దోమలను నివారించవచ్చని,  ప్రజల భాగస్వామ్యంతోనే  డెంగ్యూ వ్యాధి నివారణ సాధ్యపడుతుందని జిల్లా కలె క్టర్  శ్రీకేశ్ లాఠకర్ అభిప్రాయపడ్డారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ ర్యాలీ కార్యక్రమం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅ తిథిగా పాల్గొని పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా డెంగ్యూ వచ్చేం దుకు గల కారణాలు తెలుసుకొని, వాటి నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన పెంచుకోవడం దీని ముఖ్యఉ ద్దేశ్యమని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయన్నారు.  డెంగ్యూ ఈడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా సంక్రమి స్తుందని, కావున ప్రతి ఒక్కరూ దోమలు వ్యాప్తిచెందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమలు సంతానోత్పత్తి చేసేందుకు వీలు లే కుండా ఖచ్చితంగా పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. మునిసిపల్ కమీషనర్లు, స్థానిక సంస్థలు, పంచాయతీ అధికారులతో గతవారమే వెక్టర్ సంక్రమణ వ్యాధులపై జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని గుర్తుచేసారు.  ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షీ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డా. ఎన్.అనురాధ, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, నగరపా లక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషు, డా. జంపు కృష్ణమోహన్, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, సంఘ సేవకులు డా.మం త్రి వెంకటస్వామి, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.