విజయనగరంజిల్లాలోని 3522 మంది మత్స్యకారులకు, మత్స్యకార భరోసా పథకం క్రింద రూ.3.52 కోట్లను, సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి వి డుదల చేశారు. బాపట్లజిల్లా నిజాంపట్నంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలోబటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలో నగదు జమచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌ను జిల్లా నుంచి కలెక్టర్ నాగలక్ష్మి.ఎస్, జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు,జెసి మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలా కుమారిలు తిలకించారు. అనంతరం లబ్దిదారులకు ఏటా రూ.10వేలు చొప్పున ఆ కుటుంబాలన్నింటికీ రూ.3.52 కోట్ల విలువైన చెక్కును చై ర్మన్ అందజేశారు. ఈకార్య క్రమంలోపూసపాటిరేగ్ ఎంపిపి మహంతి కల్యాణి, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షులు చిన్నప్పన్న, డైరెక్టర్ నర్సింహులు, టూరి జం కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మత్స్యకార సంఘ నాయకులు, మత్స్యశాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.