విశాఖజిల్లాలో 12,173 లబ్ధిదారులకు మత్స్యకారబరోసా


Ens Balu
16
Visakhapatnam
2023-05-16 10:41:01

వై.యస్.ఆర్. మత్స్యకార భరోసా   మత్స్యకారుల  బ్యాంకు  ఖాతాల్లో నేరుగా  రాష్ట్ర  ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి  నగదు  జమ చేశారు.  వేట నిషేధం అమలులో  ప్రభావితం  కాబడిన  కుటుంబాలకు మంగళవారం బాపట్ల జిల్లా నిజాంపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుండి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి 2023–24 ఏడాదికి  సంబంధించి  5వ విడత  వై.యస్.ఆర్  మత్స్యకార  భరోసా  ఆర్థిక  సహాయం క్రింద ఒక్కో  కుటుంబానికి  10 వేల  రూపాయలు   సంబంధిత  మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.   ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే  వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, వేట నిషేధం (ఏప్రిల్ 15నుంచి జూన్ 15వరకు 2 నెలలు) అమలులో ప్రభావితం కాబడిన 12,173 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.10,000/- లు చొప్పున ₹.12.17కోట్లు జీవన భృతి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.  రాష్ట్ర మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.10,000/- లు చొప్పున ₹.123.52 కోట్లు రూపాయలు ఆర్థిక సా యం  మంజూరు చేసినందుకు జీవితాంతం మత్స్యకారులందరు సీఎం జగమ్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలియజేసారు. 

సముద్రం పై వేటకు వెళ్లే మత్స్యకారుల స్ధితిగతులను మెరుగుపరిచి వలసలను అరికట్టే లక్ష్యంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రారంభించగా జిల్లాలో జిల్లా రెవెన్యూ అధికారి  ఎస్ శ్రీనివాసమూర్తి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లాలో మత్స్యకార భరోసా క్రింద 12,17,30,000/- ల రూపాయల మెగా చెక్కును మత్స్యకారులకు  అందజేశారు.  జిల్లా నుండి  ఈ కార్యక్రమం  లో  జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్.ఎల్.సి వంశీకృష్ణా యాదవ్ , జాయింట్ డైరెక్టర్(ఫిషరీస్) విజయ, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇంచార్జ్ పూర్ణిమ దేవి,  ఫిషరీస్ వెల్ఫేర్ యండ్ డెవలప్మెంట్  డైరక్టర్ పి.విజయ చంద్ర , పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.