వైద్యఆరోగ్యశాఖలో దొడ్డిదారి నియామకాలపై విచారణ


Ens Balu
47
Visakhapatnam
2023-05-19 14:43:54

విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖలోని దొడ్డిదారిన చేపట్టిన పారామెడికల్ నియామకాలపై డిఎంహెచ్ఓ డా.పి.జగదీశ్వర్రావు విచారణ చేపట్టారు. ఎంతమంది పారామెడికల్ సిబ్బందిని దొడ్డిదారి న నియమించారు..? అప్పుడు సదరు సీటు చూస్తున్నవారెవరు..? ఎన్ని నెలలుగా వారికి జీతాలు ఇస్తున్నారు..? అనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ వేగంగా జరుగుతోంది. పారా మెడికల్ నియామకాలు జరిగిన సమయంలో ఒకింత పారదర్శకంగానే చేపట్టినప్పటికీ, ఆఖరులో ఈబిసి కోటాలోని కొన్ని ఉద్యోగాలను దొడ్డిదారిన చేపట్టారనే ఫిర్యాదులు అధికమయ్యా యి. విశాఖజిల్లాతోపాటు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు కూడా ఇక్కడి నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. నియామకాల జాబితాలో పేర్లు చేర్చి, అడ్డదారిన చేపట్టిన నియామకాలపై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విశాఖజిల్లాలో ఎప్పుడు పారామెడికల్ నియామకాలు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాల్లో చేపట్టినా ఖచ్చితంగా ఏదోఒక విధంగా అడ్డదారిన కొందరు ఉద్యోగాలు పొందుతుంటారు. ఆ సమయంలో పంపకాల్లో వచ్చిన తేడాలే సదరు విషయాన్ని సిబ్బందిలో సిబ్బందికి పడక దానిని మీడియాకి లీక్ చేస్తూ ఉండటం ఇక్కడ కార్యాలయం స్పెషాలిటి. ఒక్కో వర్గం ఒక్కో వర్గం మీడియాను పెంచి పోషిస్తూ వస్తుంటుందనే ప్రచారం కూడా గట్టిగానే సాగుతుంది. ఏ విభాగంలోనైనా నియామ కాలే కాకుండా బదిలీలు, పదోన్నతులు జరిపే విషయంలోనూ కోరుకున్న ప్రదేశాలు కేటాయించే విషయంలోనూ ఇక్కడి అధికారుల నుంచి సిబ్బంది వరకూ అత్యంత పారదర్శకంగా అడి గిన మొత్తం తీసుకునే కార్యక్రమాలు చేపడతారనే విషయం ఇటీవల జరిగిన అనధికార నియామకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ లు గుర్రుగా ఉండటంతో జరిగిన తేడా కార్యక్రమాలపై విచారణ వేగవంతం చేశారు జిల్లా అధికారులు. ఈ దొడ్డి దారి వ్యవహారంలో ఎంతమంది పైకి వస్తారు..? ఎంతెంత మొత్తాలు తీసుకొని నియామకాలు చేపట్టారనే విషయం తేటతెల్లం కానుంది..!