ఉత్తరాంధ్ర ఇలవేల్పు, పుణ్యక్షేత్రం,అనకాపల్లి గవరపాలెం లో వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయ పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. జగద్గురు శంకరాచార్య సంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిశ్వురులు శ్రీ సరూపనందేంద్ర సరస్వతి మహాస్వామి ,తత్కరకమల సంజాతులు శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి మహా స్వామి లచే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాలనాయుడు, ఎంపీ డాక్టర్ బి.వి.సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, దాడి రత్నాకర్, దాడి జయవీర్, ప్రభుత్వ విఫ్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని దేవస్థాన కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్ తెలిపారు . అలాగే ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.