ఏఎస్ఆర్ జిల్లాలో 2565.81 ఎకరాల భూమి పంపిణీ


Ens Balu
16
Visakhapatnam
2023-06-13 07:18:37

అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిరుపేదలకు భూముల పంపిణీ సంబంధించిన అసైన్మెంట్ కమిటీసమావేశం మంగళవారం జరిగింది. కమిటీ చైర్మన్, ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన మంగళవారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో జూoమీటింగ్ ద్వారా మంత్రి అమర్నాథ్ అధికారులు, అనధికారులతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో పాడేరు, అరకు,రంపచోడవరం ఎమ్మెల్యేలు కే భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణుడు, ధనలక్ష్మి ఎమ్మెల్సీలు, కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్, చింతూరు సబ్ కలెక్టర్ సూరజ్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్స్వాల్ తదితరులు పాల్గొన్నారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 550 మంది లబ్ధిదారులకు 777.45 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి సమావేశం ఆమోదం తెలిపింది.అలాగే పాడేరు నియోజకవర్గం సంబంధించి 561 మంది లబ్ధిదారులకు 499.53 ఎకరాల భూ పంపిణీకి రంగం సిద్ధం చేసింది. 

రంపచోడవరం నియోజకవర్గంలో 560 మంది లబ్ధిదారులకు 1288.83 ఎకరాల భూమినిపంపిణీ చేయాలని సమావేశం నిర్ణయించింది. మొత్తం మీద ఈ జిల్లాలో 1671 మంది లబ్ధిదారులకు 2565.81 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలుమాట్లాడుతూ తమ తమ నియోజకవర్గాలలో అర్హత కలిగిన వారు ఇంకా మిగిలి ఉన్నారని వారికి కూడా తగిన న్యాయం చేయాలని మంత్రి అమర్నాధుని కోరగా అటువంటి వారిని గుర్తించి రెండవ జాబితాలో చేర్చాలనిఆయన అధికారులను ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ భూములకు సంబంధించిన పత్రాలు లబ్ధిదారులకు అందజేయన్నామని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.