ఆరిలోవ ప్రాంత అభివృద్ధికి కృషి..జివిఎంసీ మేయర్


Ens Balu
15
Visakhapatnam
2023-06-14 08:14:47

ఆరిలోవ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె 2వ జోన్ 11వ వార్డు పరిధిలోని ఆరిలోవ, బాలాజీ నగర్, శ్రీకాంత్ నగర్, పెదగదిలి జంక్షన్ తదితర ప్రాంతాలలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మతో కలిసి పర్యటించి వార్డులోని సమస్యలపై మేయర్ కమిషనర్ తో చర్చించారు. ముఖ్యంగా ఆరిలోవ కళ్యాణమండపం పునర్ధర్మ పనులు వేగవంతం చేయాలని, ఆరిలోవ జంక్షన్ అభివృద్ధి, ఆరిలోవ ప్రధాన రోడ్డుపై ఉన్న దుకాణాలను తొలగించి వాటిని ఒక క్రమ పద్ధతిలో నిర్మించి తిరిగి వారికే ఇవ్వాలని, కేర్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేయడం, బీటీ రోడ్డు నిర్మించవలసి ఉందని మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ స్పందిస్తూ పనులు అంచలంచలుగా అభివృద్ధి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పట్టణ ప్రణాళిక అధికారి సునీత, డిడిహెచ్ దామోదరావు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, ఏఎంఓ హెచ్ కిషోర్, ఏఈ అప్పాజీ పాల్గొన్నారు.