విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు షురూ అయ్యాయి. ఉమ్మడి విశాఖజిల్లా యూనిట్(అనకాపల్లి, అల్లూరి పాడేరు) గానే ఈ బదిలీల ప్రక్రియ సాగుతున్నది. దీనితో 2కొత్త జిల్లాల సిబ్బంది కూడా విశాఖలోని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ బదిలీల ప్రక్రియ ఈనెల 20వరకూ కొనసాగనున్నది. ఇప్పటికే కొత్త ఇక్కడ పనిచేసి కొత్త జిల్లాలకు వెళ్లిన వారు కూడా అధికంగానే దరాఖాస్తులు చేసుకున్నారు. మరో వైపు ఫారెన్ డిప్యుటేషన్ పై వెళ్లిన సిబ్బంది కూడా తిరిగి జిల్లాకి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. పెద్ద ఎత్తున సిబ్బంది బదిలీలకు దరఖాస్తుచేసుకోవడంతో విభాగాలుగా వారీగా ప్రక్రియను చేపట్టారు అధికారులు. తొలిరోజు మూడు కేడర్ల సిబ్బందికి బదిలీలు జరుగుతాయి. ఇలా అన్ని కేడర్లలోని సిబ్బందికి ఈసాధారణ బదిలీలు జరగనున్నాయి. చాలామంది కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు అన్నిదారులను వినియోగించుకుంటున్నారు. రోడ్ పాయింట్ పీహెచ్సీల ఖాళీలను కొన్నింటిని కావాలనే బ్లాక్ చేసినట్టు తెలిసింది.