శ్రీకాకుళం జిల్లాలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో విధులు నిర్వహించుచున్న 302 మంది జర్నలిస్టులకు సంబంధించి అక్రిడిటేషన్ మొదటి జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ శ్రీకేష్ లాఠకర్ ఆమోదించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు ఛైర్మన్ డి ఎం ఎ సి, అధ్యక్ష తన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంబంధించిన విషయాలను చర్చించించారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసిన జర్నలిస్టులు ప్రభుత్వ జారీ చేసిన జిఓ నంబర్ 38ను అమలు చేయాలన్నారు. ధరఖాస్తు చేసుకొని సదరు ధరఖాస్తులను జిల్లా పౌర సంబంధాల కార్యాలయానికి అందజేయాలని అన్నారు. నిబంధనలను అనుసరించి ధరఖాస్తులు చూసి మంజూరు చేయాలని తెలిపారు. డిపిఆర్ఓ కె.బాలమాన్ సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఆన్ లైన్ లో వచ్చిన ధరఖాస్తులను అర్హత గల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ల మంజూరుకు పరిగణనలోకి తీసుకున్నట్లు కమిటీకీ వివరించారు.
అనంతరం జిల్లాలో నూతనంగా ఏర్పాటు కాబడిన కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మెన్ కు పుష్పగుచ్చం ఇచ్చి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కె.వేణుగోపాలరావు, కె. శివశంకర్, ఎన్.ఈశ్వరరావు, ఎస్. జోగినాయుడు, కె. జయ శంకర్, ఆర్టీసీ డిపో మేనేజర్, కె.ఆర్.యస్. శర్మ, వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రకాషరావు, కార్మిక శాఖ, కన్వీనర్, డిఐపిఆర్ఓ ఎస్వీ రమణ, డివిజనల్ పౌర సంబంధాల అధికారి నత్తల రాజు, పి.ఆర్.ఓ ఆర్.ఆర్ మూర్తి, ఎఇలు పుణ్యవతి, అప్పలనాయుడు, ఎవిఎస్ జివి రవి కుమార్, ఫోటో గ్రాఫర్ రాజు తదితరులు పాల్గొన్నారు.