భారత రాష్ట్రపతికి రూ.10 చెల్లించి శుభాకాంక్షలు చెప్పండి


Ens Balu
19
Visakhapatnam
2023-06-16 09:59:10

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టినరోజు సందర్భంగా తపాలాశాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ-పోస్టు ద్వారా రూ.10 చెల్లించి ఎవరైనా నేరుగా భారత రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. విశాఖపట్నం పోస్టల్ డివిజన్, పౌరులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తపాల శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రజలను వారి ఆదర్శ వ్యక్తులకు చేరువ చేయడమే లక్ష్యంగా తపాల శాఖ ఇ పోస్ట్ మెసేజ్ల ద్వార ఈ అవకాశాన్ని కల్పిస్తుందని తపాలశాఖ పేర్కొంది. ఆశక్తి గలవారు వారి ఈ నెల 20 తేదిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జన్మదిన సందర్భంగా ప్రజలు తపాల శాఖ లోని ఈ-పోస్టు ద్వారా తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజే యవ చ్చునని ఆ ప్రకటనలో తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఈ నెల 18వ తేది వరకు విశాఖపట్నం డివిజన్ లోని అన్ని పోస్ట్ ఆఫీసులో వినియోగించు కోవచ్చునని పోస్టల శాఖ పేర్కొంది.