ప్రభుత్వ నిధులు కాజేయడంలో మార్గదర్శిలు..
Ens Balu
2
s.rayavaram
2020-09-28 09:49:14
ప్రభుత్వ నిధులు ప్రభుత్వానికి అనుమానం రాకుండా కొట్టేయడంలో గ్రామసచివాలయ వ్యవస్థలో ఈఓపీఆర్డీలు నూతన అధ్యాయానికి తెరతీశారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూనే పారిశుధ్య నిర్వహణ, ఇంటిపన్నుల పేరుతో మరికొందరు కార్యదర్శిలు కూడా ప్రభుత్వ ఖజానికి కన్నవేసి...మరికొందరు అవినీతి సిబ్బందికి మార్గదర్శకులవుతున్నారు. విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలంలో మూడు సచివాలయాల పరిధిలో ఒక ఈఓపీఆర్డీ ఏవిఎస్ఎస్ ప్రసాద్ తో సహా మరో ఇద్దరు కార్యదర్శిలు నర్సీపట్నం డివిజనల్ పంచాయతీ అధికారికి అడ్డంగా చిక్కారు. భారీస్థాయిలో ప్రభుత్వ నిధులు గల్లంతు అయిన తరువాత కూడా జిల్లా అధికారులు గ్రామసచివాలయాల్లోని చేతివాటం ప్రదర్శించే కార్యదర్శిలపై నిఘా పెట్టకపోవడం, ఇంకా ఇలాంటి తేడా కార్యదర్శిలున్న గ్రామసచివాలయాల్లో తనిఖీలు చేపట్టకపోవడంతో మా దగ్గరకి అధికారులు రారు...వచ్చినా లక్షలకి లక్షలు పెట్టిన తేడా బిల్లులు తనిఖీచేయకుండా మేమిచ్చేది మేము ప్రతీనెలా పంపేస్తున్నామనే ధిమాతో వ్యవహరించడం అధికారులపై బురదజల్లే కార్యక్రమాలకు తెరతీస్తున్నారు. కరోనా వలన ప్రభుత్వంపై శానిటేషన్ భారం పడినా, రాష్ట్రవ్యాప్తంగా మాత్రం గ్రామసచివాలయాల్లోని తేడా కార్యదర్శిలకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. బ్లీచింగ్, ఫినాయిల్, శానిటైజర్, ఇతర శానిటేషన్ పద్దుల పేరుజెప్పి గట్టిగానే సంపాదించారనే విషయం ఎస్.రాయవరంలోని మండల కేంద్రంలోని గ్రామసచివాలయంలో జరిగిన అవినీతి చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. అంతేకాదండోయ్...ఈఓపీఆర్డీ స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా పంచాయతీ అధికారులకు అధికారాలు లేవు...దీనితో వాళ్లు చేసే అవినీతిపై రాష్ట్రస్థాయిలో కమిషనర్ కి నివేదికలు పంపిస్తారు. ఈలోగానే అవినీతి ఈఓపీఆర్డీలు ఆ తప్పులను ఒప్పులుగా మార్చేసుకోవడంతో హస్తలాఘవం చూపిస్తున్నారు. ఈ తరహా తేడా గ్రామకర్యదర్శిల వ్యవహారం గుర్తించాలంటే పూర్తిస్థాయిలో విచారణ పత్రాలు కలెక్టర్ ద్వారానే కమిషనర్ కి చేరితే ఫలితం వుంటుంది లేదంటే...అవినీవి వ్యవహారం కాస్తా ఈ ఈఓపీఆర్డీ, కార్యదర్శి చాలా మంచివాడికి కిందికి తేల్చేసుకునే ఉద్దండులున్నారు. అవినీతి వెలుగు చూసిన తరువాత కూడా చర్యలు తీసుకోకపోతే...ప్రజలకు ప్రభుత్వంపై ఎలాంటి అపనమ్మకం పెరుగుతుందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు...