భారత స్వతంత్ర పోరాటం లో అల్లూరి మార్గదర్శి


Ens Balu
15
Visakhapatnam
2023-07-04 06:42:25

భారత స్వాతంత్ర్య పోరాటానికి  అల్లూరి సీతారామరాజు ఒక మార్గదర్శిగా నిలిచారని సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. అతి పిన్న వయసు లోనే దేశం కోసం త్యాగం చేసి స్వతంత్ర స్ఫూర్తిని రగిల్చిన వ్యక్తిగా చరిత్ర లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఇలాంటి వీరుల  గాధలను భావి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని  మంగళవారం  కలెక్టరేట్ ఆడిటోరియంలో   ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి జేసీ, డి.ఆర్.ఓ, అధికారులు  నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభ లో  జె.సి మాట్లాడుతూ  అల్లూరిలోని నాయకత్వ లక్షణాలను,   వారి త్యాగ స్ఫూర్తిని ,దేశ భక్తిని ఆదర్శంగా తీసుకోవాలని  తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ఆకాంక్షించారు. డి.ఆర్.ఓ గణపతి రావు మాట్లాడుతూ ఏమీ  ఆశించకుండా దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరుడు అల్లూరి అని అన్నారు. యువత నిస్వార్ధంగా ఆలోచించి దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మెప్మా పిడి సుధాకర్ అల్లూరి దేశ భక్తిని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.