స్పందనకు 136 వినతులు..
Ens Balu
3
కలెక్టరేట్
2020-09-28 14:06:00
శ్రీకాకుళంజిల్లాలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 136 వినతులు వచ్చినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన ఆయన పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించారు. ఫిర్యాదుల్లో రెవిన్యూ శాఖకు చెందినవి 36 కాగా, పౌర సరఫరాల శాఖకు సంబంధించినవి 16 మరియు ఇతర శాఖలకు సంబంధించిన వినతులు 84 వచ్చినట్లు డి.ఆర్.ఓ. తెలిపారు. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి 136 మంది తమ ఫిర్యాదులను తెలియజేసారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్.సెక్షన్ సూపరింటెండెంట్ డి.అప్పారావు, గ్రీవియన్స్ సెల్ సూపరెంటెండెంట్ భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.