విదేశీ వీసాలు పేరిట మోసాలతో జరభద్రం


Ens Balu
16
Visakhapatnam
2023-07-20 09:30:19

విదేశీ విద్య, వీసాలు పేరిట మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని సీతమ్మధారలో గల ఎన్ బీ ఎం లా కళాశాల లో ఇంటర్నేషనల్, ఇమ్మిగ్రేషన్ లా అంశంపై ఏర్పాటు చేసిన సదస్సు లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులే లక్ష్యంగా ఆ రంగంలో నిత్యం జరుగుతున్న చాలా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు చెందిన నకిలీ వీసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో తగిన విచారణ చేయాలన్నారు. సదరు సంస్థ గుర్తింపు, జాబ్ ఆఫర్ లెటర్ క్షుణ్ణంగా పరిశీలించా లన్నారు. నైజీరియా, ఆఫ్రికా దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్లు రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు ఇస్తున్నారన్నారు. వీటి పట్ల అందరూ ముందు జాగ్రత్త గా వుండాలన్నారు. ఈ మేరకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎన్బిఎం లా కళాశాల ప్రిన్సిపాల్ డి.వి.రమణ, అధ్యాపకులు, న్యాయ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.