3రోజుల నిరసనలు విజయవంతంచేయండి..
Ens Balu
2
సిఐటియు కార్యాలయం
2020-09-28 14:14:00
కేంద్ర బిజేపి ప్రభుత్వం రైతు, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1 తేదీలలో విశాఖనగరం, నియోజకవర్గ కేంద్రాల్లో 3 రోజులూ దీక్షలు జరపాలని వామపక్ష పార్టీల ఐక్యవేది నిర్ణయించింది. ఈ మేరకు నిరసనలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చేయాలని సోమవారం సిపిఐ(ఎం) కార్యలయంలో జరిగిన వామపక్షా ల సమవేశం నిర్ణయం తీసుకుంది. కేంద్రం లో ఉన్న బిజేపి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, పార్లమెంటు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ తెచ్చిన రైతాంగ, వ్యవసాయ వ్యతిరేక బిల్లులను నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ అనుకూల పరిపాలన వేగంగా అమలు చేస్తోందన్నారు. రైతుల పొట్టకొట్టి, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేందుకు బిజెపి ప్రభుత్వం సంస్కరణల పేరుతో రాష్ట్ర అధికారాలను హరించివేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే విద్యుత్ సంస్కరణలు, డిస్కంలను ప్రైవేటీకరించడం, వ్యవసాయ మోటార్లకు నీటి మీటర్లు బిగించడం, రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తీసుకురావడం వంటి చర్యలకు కేంద్రం పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాలతో పాటు రాజకీయాలకు అతీతంగా రైతాంగమంతా దీక్షల్లో పాల్గొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(యుం) డా. బి గంగారావు, సిపిఐ ఎం.పైడిరాజు సిపిఐఎంఎల్(న్యూడెమొక్రాసి)వై.కొండయ్య, ఎంసిపిఐ(యు) శంకర్ రావులు పాల్గొన్నారు.