విద్యార్ధులు ర్యాగింగ్ కి పాల్పడి జీవితం నాశనంచేసుకోద్దు


Ens Balu
17
Visakhapatnam
2023-07-25 15:41:41

విద్యార్ధులు ర్యాగింగ్ భారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని విశాఖజిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవిశేషమ్మ సూచించారు. మంగళవారం ఆంధ్రామెడికల్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రొహిభిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్ కి పాల్పడిన వారికి జైలుశిక్ష జరిమానాలు ఉంటాయన్నారు. విద్యార్ధులు స్నేహ భావంతో మెలగాలి తప్పితే ఎక్కడా ఇతర విద్యార్ధులను ఇబ్బందులకు గురిచేసే  పనులు చేయకూడదన్నారు. అన్ని కళాశాలలు, పాఠశాలు, యూనివర్శిటీల్లో  ఈ యాక్టు అమలులో వుంటుందని తెలియజేశారు. విద్యార్ధులు ర్యాగింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డా.రవీంధ్రకిషోర్, డా.టి.సురేఖ, డా.ఎం.హేమరాధిక ఇతర అధ్యాపకులు, పెద్ద ఎత్తున విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.