విజెఎఫ్ లెక్కల్లో బొక్కలు కప్పేయడానికి మాస్టర్ ప్లాన్..!


Ens Balu
174
Visakhapatnam
2023-07-26 06:07:10

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) లెక్కల్లో బొక్కలు పూర్తిగా కప్పేయడానికి అనధికార కాలం చెల్లిన కమిటీ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తున్నది. దానికి అను గుణంగా జిల్లా అధికార యంత్రంగాం కూడా వ్యవహరిస్తున్నట్టు తాజా పరిణిమాలు రుజువుచేస్తున్నాయి. అసలు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో తేడా వచ్చిన లెక్కల్లో బొక్కలు తేల్చకుండా..మాయం చేసిన రిసిప్ట్లు బయటకు తీయకుండా.. లక్షల్లో వచ్చిన లెక్కల్లో తేడాలు బయటకు రాకుండా..డాబాగార్డెన్స్, సీతమ్మధారలోని నార్ల వెంకటేశ్వర భవన్ ద్వారా వచ్చే ఆదాయంలోని అసలు విషయం బయట పడకుండా తెరవెనుక పెద్ద కార్యాచరణ జరుగుతుందనే విషయం ప్రస్తుతం విజెఎఫ్ లో సభ్యులు గుర్తించినట్టుగా చెబుతున్నారు. భారీమొత్తంలో జరిగిన అవినీతి, లెక్కలకు బొక్కలు పెట్టి చూపిన ఆడిట్ రిపోర్టులు, అద్దెకిచ్చిన షాపులకు లేని అగ్రిమెంట్లు..ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ వేయకుండా చూపించిన చిట్టాపద్దుల ఆడిట్ రిపోర్టులు..అడుగడుగునా అత్యంత భారీ తేడా వ్యవహారాలే ప్రెస్ క్లబ్ విషయంలో కాలం చెల్లిన కమిటీ చేసినట్టు ఆధారాలు బయటకొచ్చాయి. ఇంత జరిగినా జర్నలిస్టులు చేసిన ఫిర్యాదుపై జిల్లా అధికారులు తేడా వచ్చిన మొత్తాన్ని రికవరీచేసే ప్రయత్నంగానీ, వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా ఉండేందకు అనర్హత వేటు గానీ వేయలేదు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 420, 34, 406 r/w క్రింద  కేసులు నమోదు అయినా నేటికీ అరెస్టులు చూపించలేదు. ఇదంతా చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తుందనే అనుమానాలను ప్రెస్ క్లబ్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లెక్కల్లో లక్షల్లో వచ్చిన బొక్కలు పూడ్చేయాలన్నా..ఈ విషయాన్ని తారుమారు చేసి సభ్యులను గతంలో మాదిరి మభ్య పెట్టేయాలన్నా.. ఇపుడు అర్జెంట్ గా ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు పెట్టేయాలి. ఎన్నికలు పెట్టేస్తే గెలిచిన వారే ఈలెక్కలు, అందులో వచ్చిన బొక్కలు, వాటికి కాలం చెల్లిన కమిటీ చూపిన కారణాలు అన్నీ వారే చూసుకుంటారు..? అపుడు జిల్లా అధికారులు ఎంచెక్కా చేతులు దులిపేసుకోవచ్చు..! దానికోసమే ఇంత పెద్ద మొత్తంలో లెక్కల్లో తేడాలు వచ్చినా.. ఆలెక్కలపై అనధికార కార్యవర్గం నుంచి రికవరీ చేసే ప్రయత్నం కూడా జిల్లా అధికారులు చేయడం లేదు. వాస్తవానికి జిల్లా రిజిస్ట్రార్ కి సర్వసభ్యసమావేశాలు జరపకుండానే..జరిపినట్టు చూపి సమర్పించిన రికార్డులతోనే ఆయనే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయాలి. అందులోనూ..ప్రతీఏటా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల ఆమోదంతో లెక్కలన్నింటికి జమాఖర్చులు రాయించి వాటికి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ వేయించి.. ఈఫైలింగ్ చేసిన తరువాత మాత్రమే(2015 నుంచి 2020 వరకూ మధ్యలో ఒక్క 2018‌-2019కి మాత్రమే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ వేసినట్టుగా ఆధారాలు చూపించారు) విజెఎఫ్ సొసైటీని జిల్లా రిజిస్ట్రార్ రెవిన్యువల్ చేయాల్సి వుంది. కానీ అవేమీ జరగకపోయినా 2015 నుంచి 2020 వరకూ అనధికార కమిటీ సర్వసభ్యసమావేశాలు పెట్టకుండా పెట్టినట్టు చూపిన ఆడిట్ రిపోర్టుతోనే రెవిన్యువల్ చేసేశారు. ఆతరువాత 2020-2023 వరకూ సొసైటీ చచ్చిపోయే వుంది. కారణంగా విషయం బయటకు తెలిస్తే..తనకు చిక్కులు ఎదురవుతాయని జిల్లా రిజిస్ట్రార్ తరువాత నుంచి సొసైటీ రెవన్యువల్ చేయడానికి నిరాకించారని చెబుతున్నారు. విజెఎఫ్ సమర్పించిన తేడా నివేదికలు, రికార్డులు కూడా ఫైవ్ మెన్ కమిటీకి సమర్పించినట్టు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టు ప్రకారం మూడేళ్ల నుంచి రెవిన్యువల్ లేకుండా ఉంటే విజెఎఫ్ సొసైటీ చచ్చిపోయినట్టే లెక్క. ఆసొసైటీకి ఇపుడు చట్టబద్దత కూడా లేదు. అయినప్పటికీ అనధికార కార్యవర్గం కార్యక్రమాలు చేస్తూ..వారి ఖర్చులను కూడా సొసైటీ డబ్బుల నుంచే చెల్లిస్తుండటం విశేషం. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు, జిల్లా రిజిస్ట్రార్ విజెఎఫ్ సొసైటీ కార్యవర్గంపై చర్యలు తీసుకోలేదు. లక్షల్లో వచ్చిన విరాళాలకు సంబంధించిన రిసిప్ట్ లు మాయం అయినా..పూర్తిస్థాయిలో రికార్డులు కాలం చెల్లిన కమిటీ జిల్లా అధికారులకు చూపించకపోయినా..ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కూడా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకుండా..విచారణ జరుగుతుందని చెబుతూనే విజెఎఫ్ ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు నిర్వహించేయడానికి అధికారులతో కమిటీ వేయడం వెనుక ఆంతర్యం ఏమిటో కలెక్టర్ చెప్పాల్సి వుంది. తొలుత త్రీమెన్ కమిటీ, ఆపై ఫైవ్ మెన్ కమిటీ విజెఎఫ్ రికార్డుల్లోని లెక్కలన్నీ బొక్కలతోనే ఉన్నాయని నిర్ధారించిన తరువాత కూడా అనధికార కార్యవర్గంపై అనర్హత వేటు వేయకుండా ఇప్పటి వరకూ నెట్టుకొస్తూ వచ్చారు. ఈవిషయంలో ఎంత మంది జర్నలిస్టులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా..ఎప్పుడు ఫిర్యాదులు వచ్చినా ప్రధాన పత్రికల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, కేవలం చిన్నపత్రికల నుంచే అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని కూడా జర్నలిస్టులతో సమావేశం ఏర్పాటు చేసినపుడు జిల్లా కలెక్టర్ ప్రస్తావించడం విశేషం.

అర్జెంట్ గా విజెఎఫ్ ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు పెట్టేస్తే..ఇప్పటి వరకూ జిల్లా ఆడిట్ ఆధికారి బయటకు తీసిన లెక్కల్లోని బొక్కలన్నీ కొత్తగా వచ్చిన కమిటీ కుస్తీలు పడుతుందనే ఆలోచనలో జిల్లా అధికారులు ఉండే ఎన్నికలు నిర్వహించేయాలనే తపనతో ఉన్నట్టు ప్రెస్ క్లబ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఆర్ధిక లావాదేవీల్లో పెద్ద మొత్తంలో తేడాలు వచ్చినపుడు..దానికి సంబంధించిన రికార్డులు లేనపుడు, ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టుకి విరుద్ధంగా వ్యవహరించినపుడు.. పెట్టని సర్వసభ్య సమావేశాలు పెట్టినట్టుగా తప్పుడు నివేదికలు జిల్లా రిజిస్ట్రార్ కి ఇచ్చినపుడు.. విజెఎఫ్ ఆస్తులను అద్దెకిచ్చే సమయంలో సదరు వ్యాపారులతో చేసుకున్న ఒప్పందాలు బహిర్గతం చేయనపుడు.. విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు కనిపించకుండా రిసిప్ట్ బుక్ లోని పేపర్లు మాయం చేసినపుడు.. ఏళ్ల తరబడి సొసైటీకి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉన్నప్పుడు..  సర్వసభ్య సమావేశాలు పెట్టకుండా పెట్టినట్టు చూపి సొసైటీని ఆన్ లైన్ లో రెవిన్యుల్ చేసినపుడు.. సొసైటీ బైలా ప్రకారం సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆమోదం లేకుండా లక్షల్లో ఆదాయాన్ని ఖర్చుచేసినపుడు..  తప్పులన్నీ ఆధారాలతో తేలిన తరువాత అనధికార కార్యవర్గంపై 420 కేసు నమోదు అయినా వాటినేం పట్టించుకోకుండా కేవలం ఎన్నికలు పెట్టేసి చేతులు దులిపేసుకుంటే..ప్రస్తుత అనధికార కమిటీపై అనర్హత వేటు వేయకుండా ఉండేందుకు వీలుపడుతుందనే ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే మాస్టర్ ప్లాన్ తోనే ఈ తేడా పథకాన్ని అమలు చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇంత పెద్ద మొత్తం లెక్కల్లో తేడాలు వచ్చినపుడు దానికి అనధికార కాలం చెల్లిన కార్యవర్గం సమాధానం చెప్పకపోయినా వారి నుంచి ఆధారాలు సేకరించని జిల్లా అధికారుల వ్యవహార శైలిపైనా అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి విజెఎఫ్ లెక్కల్లో లక్షల్లో వచ్చిన బొక్కలు కప్పేయడానికి ఇంకెన్ని మాస్టర్ ప్లాన్ లు వేస్తారో అనేది..!

సిఫార్సు