విశాఖ పర్యటనలో సీఎం జగన్ ద్రుష్టికి విజెఎఫ్ పంచాయతీ..!


Ens Balu
123
Visakhapatnam
2023-07-28 06:26:13

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) పంచాయతీని విశాఖలోని జర్నలిస్టులు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పర్యటనలో ఆయన ముందుకి ఆధారాలతో సహా వెళ్లనున్నారు. దానికోసం సేవ్ విజెఎఫ్ ఉద్యమకారులు కాలంచెల్లం చెల్లిన అనధికార కార్యవర్గం చేసిన మోసాలన్నింటినీ లిఖిత పూర్వకంగా సీఎం  ముందు పెట్టనున్నాయి. 2015 నుంచి కార్యవర్గం అమలులో లేకుండానే అనధికారికంగా సదరు కమిటీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. విజెఎఫ్ బైలా ప్రకారం రూ.10వేలు ఖర్చుదాటితే సభ్యుల సమ్మతి సర్వసభ్య సమావేశంలో తీసుకోవాల్సి ఉన్నది. అలా కాకుండా కార్యవర్గం ఏకపక్షంగా సభ్యుల ఆమోదంతో పనిలేకుండా నేటి వరకూ లక్షలాది రూపాయాలు వారి సొంత నిర్ణయాలతో ఖర్చుచేస్తూ వచ్చారు. పైగా పెట్టని కార్యవర్గ సమావేశాలను పెట్టినట్టుగా 2015 నుంచి 2020 వరకూ చూపించి.. జిల్లా రిజిస్ట్రార్ కి విజెఎఫ్ పై 2 కోర్టుకేసులు దాఖలైన విషయాలను దాచి, నేటి వరకూ ఎలాంటి కేసులు దాఖలు కాలేదని లిఖిత పూర్వకంగా రాసి, ఆకాలంలో ఒక్కసారి కూడా ఇన్కమ్ టాక్స్ కట్టకుండా కేవలం ఆడిట్ రిపోర్టులు మాత్రమే చూపించి మరీ మోసం చేసింది. ఆపై విజెఫ్ సొసైటీని ఆన్ లైన్ లో 2020 వరకూ రెవిన్యువల్ ను ఆన్ లైన్ లో అడ్డదారిన చేసేసింది. వాస్తవానికి అలా తప్పుడు పత్రాలు సమర్పించినందుకు జిల్లా రిజిస్ట్రార్ విజెఎఫ్ అనధికార కార్యవర్గంపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి వుంది. కాకపోతే ఈ విజెఎఫ్ సొసైటీ జర్నలిస్టులది కావడంతో గొడవలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంతో విజెఎఫ్ కార్యవర్గం సమాచారా న్ని సమాచారహక్కుచట్టం ద్వారా జర్నలిస్టులు బయటకు తీయడంతో 2020 తరువాత సొసైటీని రెవిన్యువల్ చేయడానికి జిల్లా రిజిస్ట్రార్ నిరాకరించారు. నాటి 
నుంచి నేటి వరకూ విజెఎఫ్ ప్రెస్ క్లబ్ సొసైటీ రెవిన్యువల్ కాకుండా అవస్థాన దశలోనే ఉండిపోయింది. అయినా అదేపేరుతో కార్యక్రమాలు మాత్రం జరిపిస్తోంది అనధికార కార్యవర్గం.

ఆ తరువాత జర్నలిస్టులు విజెఎఫ్ అనధికార కార్యవర్గం చేస్తున్న మోసాలను, అక్రమాలను, అవినీతిని, చేయని ఖర్చులకు లక్షల్లో చూపించిన బిల్లులు, ఆదాయానికి, ఖర్చుకు పొంతనలేకుండా చూపించిన ఆడిట్ రిపోర్టులను కలెక్టర్ కి నివేదించారు. వీటిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున తొలుత, త్రీమెన్ కమిటీ, ఆపై ఫైవ్ మెన్ కమిటీ వేశారు. ఆసమయంలోనే జిల్లా ఆడిట్ అధికారితో విచారణచేయిస్తే సుమారు రూ.30లక్షలకు పైగా లెక్కల్లో వ్యత్యాసాలు వచ్చాయి. అంతేకాకుండా పలువురు దాతలు ఇచ్చిన విరాళాలకు సంబంధించిన రిసిప్ట్ లను మాయం చేసిన విషయం కూడా బయటకు వచ్చింది. పైగా 2020 నుంచి 2023 వరకూ కార్యవర్గంగా చెప్పుకుంటున్నా..సదరు విజెఎఫ్ సొసైటీ ప్రస్తుతం చచ్చిపోయి ఉంది. కారణం కాలం చెల్లినక కమిటీ చేసిన తేడా వ్యవహారాలతో జిల్లా రిజిస్ట్రార్ 2020 తరువాత విజెఎఫ్ సొసైటీని రెవెన్యువల్ చేయడానికి నిరాకరించారు. సమాచారహక్కుచట్టం ద్వారా జర్నలిస్టులు బైలా, బైలా సవరణలు, ఆడిట్ రిపోర్టులు, పెట్టని సర్వసభ్య సమావేశం పెట్టినట్టుగా చూపించిన రికార్డులను అధికారికంగా తీసుకోవడంతో అసలు విషయం క్లబ్ లోని మిగతా జర్నలిస్టులకి తెలిసింది. ఆ తరువాత కూడా కోర్టుకేసులకు సంబంధించి విజెఎఫ్ అనధికార కమిటీ సభ్యులకు ఎవరికీ సర్వసభ్య సమావేశం పెట్టి చెప్పకపోగా..అదే కోర్టుకేసులకు లాయర్ ఫీజు క్రింది సుమారు లక్ష రూపాయల వరకూ చెల్లించినట్టు ఆడిట్ రిపోర్టులో చూపించింది. ఆ విషయాన్ని ఫైవ్ మెన్ కమిటీ అధికారులు జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లడంతో..విచారణ చేయించి ఆ నివేదికను, జిల్లా ఆడిట్ ఆఫీసర్ బయటపెట్టిన ఆధారాలను, అనధికార కార్యవర్గం చేసిన మోసాలను విజెఎఫ్ నోటీసు బోర్డులో ప్రదర్శనకు ఉంచారు.

విజెఎఫ్ అనధికార కార్యవర్గంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు, అధికారుల కమిటీ నియామకం, లక్షలాధి రూపాయలవ్యత్యాసాలు బయటపడిన విషయం, ఆపై పోలీసు కేసు నమోదు అయిన అంశాలు, వాటి ఆధారాలు, ఆదాయానికి మించి.. నార్ల వెంకటేశ్వరభవన్ లో కార్యవర్గంలో ఒక సభ్యుడి ప్రైవేటు డాన్సు స్కూలు నిర్వహించుకున్నదానికి విజెఎఫ్ ఆదాయం నుంచే చెల్లించిన కరెంటు బిల్లుల వ్యవహారం.. ఇంకా లెక్కల్లోకి రాని ఆదాయాలు, చేసిన ఖర్చులు, నార్ల వెంకటేశ్వరభవన్ లోని బేకరీ షాపుల రెంటల్  అగ్రిమెంట్లు, వాటితోపాటు మరో మూడు షాపులకు చెందిన రెంటల్ అగ్రిమెంట్లు, భవనంపై ప్రచారం కోసం వేసి హోర్డింగ్ అగ్రిమెంట్లు, సంబంధం లేని అంశాలకు తీసిన హోటల్ రూముల బిల్లులు, ఇలా అన్ని ఆధారాలూ సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. గతంలోనే సీఎంని కలవాలని ప్రయత్నం చేసినప్పటికీ పోలీసు నియంత్రణ చర్యలతో కలవడానికి వీలుపడలేదని, ఇపుడు పోలీసులే అనధికార కార్యవర్గంపై సెక్షన్ 420, 34, 406r/w, ఎఫ్ఐఆర్ నమోదు అయినందున మార్గం సుగమం అయినట్టు సమాచారం అందుతుంది. కాగా ఇప్పటికే ఇదే సమాచారాన్ని అమరావతిలోకి సీఎం క్యాంపు క్యారాలయానికి ఒక నకలు, ఫిర్యాదు పంపించారని కూడా చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పార్టీలోని పలువురి నేతలకు తెలియజేశాయని, ఆ కారణంగానే అనధికార కార్యవర్గంపై జిల్లా యంత్రాంగం వేగం చర్యలకు ఉపక్రమించిందనే ప్రచారం జరుగుతుంది.

కాగా ఇప్పటికే విజయనగరం ప్రెస్ క్లబ్ విషయంలో అప్పటి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ముక్కుసూటిగా వ్యవహరించి..అవినీతికి పాల్పడిన కార్యవర్గం నుంచి ప్రెస్ క్లబ్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇపుడు విశాఖలోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ విషయంలో కూడా అదే జరిగింది. అనధికార కార్యవర్గం నుంచి తాళాలు, రికార్డులు జిల్లా కలెక్టర్ నియమించిన ఫైవ్ మెన్ కమిటీ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇపుడు సభ్యుల గుర్తింపు కోసం ఐదుగురు సీనియర్ జర్నలిస్టులతో కూడా కిమటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహాంలో ఏఏ ప్రభుత్వశాఖలకు జర్నలిస్టులు ఫిర్యాదులు చేశారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ చేపట్టిన కార్యాచరణ, బయటపెట్టిన వాస్తవాలు, ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో అనధికార కార్యవర్గం చేసిన రచ్చ, దానికి సంబంధించిన వీడియో ఫుటేజి ఇలా మొత్తం ఒక పెద్ద ఫైలే సీఎం ముందుకి తీసుకెళ్లేందుకు సర్వం సిద్దం చేసిందని చెబుతున్నారు. ప్రస్తుత అనధికార కార్యవర్గం చేసిన మోసాలను, అక్రమాలను, ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టుకి తూట్లు పొడి, విజెఎఫ్ బైలాను అతిక్రమించి ఈ కాలం చెల్లిన కార్యవర్గం చేసిన వ్యవహారాలను ఆధారాలతో సహా బయటపెట్టడం ద్వారా మరో కార్యవర్గం ఇలాంటి తేడా వ్యవహారాలు, తప్పుడు పనులకు పూనుకోకుండా ఉంటుందనేది ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల ఆలోచనగా కనిపిస్తున్నది. చూడాలి ఈ మొత్తం పంచాయతీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ద్రుష్టికి వెళ్లిన తరువాత ఎలాంటి పరిణామాలు, చర్యలు చోటుచేసుకుంటాయనేది..!