విజెఎఫ్ అనధికార కమిటీపై పెట్టిన ఆ సెక్షన్లు పని మొదలెట్టాయి


Ens Balu
135
Visakhapatnam
2023-07-28 11:25:16

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) కాలం చెల్లిన అనధికార కమిటీపై టూటౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన సెక్షన్లు 420, 34, రెడ్ విత్ 406  సెక్షన్లు పనిచేయడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా ఈ సెక్షన్లుతో పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్న వారు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఉండకూడదు. మరీ ముఖ్యంగా దేవాదాయశాఖ 1987చట్టం ప్రకారం 15 నుంచి 20 అంశాల ఆధారంగా సెక్షన్ 19ని అమలు చేస్తూ..ఏదైతే దేవస్థానంలో ట్రస్టుబోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారో వారిపై సదరు దేవస్థాన ఈఓ ప్రభుత్వానికి లేఖ రాయాలి. ఇలాంటి కేసులు ఉన్నవారిని ట్రస్టుబోర్టులో కొనసాగించడానికి కూడా వీలుండదు. కానీ సింహాచలం దేవస్థానం ఈఓ వేండ్రత్రినాధరావు ట్రస్టుబోర్డు సభ్యుడు, జాతీయజర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అనధికార కార్యవర్గానికి అక్షుడిగా వున్న గంట్ల శ్రీనుబాబు కేసులపై ప్రభుత్వానికి నివేదిక నేటి వరకూ సమర్పించనే లేదు. కానీ ఆవిధంగా జరగకపోవడం పట్ల పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. పోలీస్ స్టేషన్ లలో మోసం, కావాలని చేసిన నమ్మద్రోహం, మూకుమ్మడిగా కావాలని చేసిన మోసాలకు సంబంధించి సెక్షన్లతో కేసులు నమోదైన వారిని ఏవిధంగా దేవాలయాల ట్రస్టుబోర్డుల్లో సభ్యుడిగా కొనసాగిస్తారనే వాదనను తెరపైకి తీసుకు వస్తున్నారు. 

అందునా ఈయన అనధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న విజెఎఫ్ లో సుమారు రూ.30 లక్షలకు పైగా ఖర్చులకు, మరికొన్ని కోట్ల రూపాయలకు రికార్డులు లేవు, ప్రభుత్వానికి సమర్పించిన ఆడిట్ రిపోర్టలన్నీ తప్పులు తడకలు, ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ అయిన మల్లిఖార్జునకు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లోని జర్నలిస్టులు ఇప్పటికే స్పందనలో ఫిర్యాదులు కూడా చేశారు. ఆ ఫిర్యాదులు ఆధారంగా ఏర్పాటు చేసిన ఫైమెన్ కమిటీ విచారణలో కార్యవర్గం కావాలనే తప్పులు, మోసాలకు పాల్పడినట్టు ప్రాధమికంగా ఆధారాలతో నిరూపణ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టుకి విరుద్దాంగా వ్యవహరించడం, విజెఎఫ్ బైలాను పూర్తిగా తుంగలోకి తొక్కడం, పెట్టని సర్వసభ్య సమావేశాలు పెట్టినట్టుగా చూపి, 12ఏళ్లలో కోట్లాది రూపాయల ఖర్చుల విషయంలో తేడాగా వ్యవహరించిన వ్యక్తిని ఏ విధంగా ట్రస్టుబోర్డులో ఎలా కొనసాగిస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. కాగా ఇప్పటికే ఇదే విషయమై సదరు ట్రస్టుబోర్డు సభ్యుడిపై నమోదైన 420 కేసు ఎఫ్ఐఆర్ పత్రాలు దేవాదాయశాఖ కమిషనర్ కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్టు కూడా తెలిసింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ 1987చట్టం ప్రకారం 15 నుంచి 20 అంశాల ఆధారంగా సెక్షన్ 19ని అమలు చేస్తూ ట్రస్టుబోర్టు సభ్యుడిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోతే సింహాచలం దేవస్థానం ఈఓపై కూడా శాఖాపరమైన చర్యలు ఉంటాయని కూడా ప్రచారం జరుగుతుంది.

సింహాచలం ట్రస్టుబోర్డు సభ్యుడిగా ఉన్నవారు నిజాయితీగా వ్యవహరిస్తూ.. ఆలయ అభివ్రుద్ధి కార్యక్రమాలు, ఇతర దేవాదాయశాఖ వ్యవహారాల్లో పాల్గొంటుంటారు. పలు ఖర్చులు, అవసరాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ట్రస్టుబోర్డులో చైర్మన్, ఈఓలకు సూచనలు సలహాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా ఇదే సభ్యుడు విజెఎఫ్ లో భారీ ఎత్తున అక్రమాలకు, అవినీతికి, చేసిన ఖర్చులకు లెక్కలు సక్రమంగా చూపకుండా అదే ప్రెస్ క్లబ్ సభ్యుల పెట్టిన పోలీసు కేసులకు కారణం అయ్యారు. ఇపుడు కనిపించకుండా దాచేసిన విరాళాలకు సంబందించిన స్లిప్పులు, కార్యదర్శి నివేదికలు, కోశాధికారి నివేదికలు తదితర వ్యవహారాలు, ఆర్ధిక నేరాలతో సంబంధాలున్న వ్యక్తులను ట్రస్టుబోర్డు సభ్యుడిగా కొనసాగిస్తే..ఎన్నో లక్షల రూపాయల అభివ్రుద్ధి పనులు ఇతర కార్యక్రమాలను ఆమోదించే బోర్డులో అభ్యంతరాలు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో సదరు వ్యక్తిని ఏ విధంగా ట్రస్టుబోర్డు సభ్యుడిగా కొనసాగిస్తారని..తక్షణమే బోర్డు సభ్యుడి హోదా నుంచి తొలగించాలనే పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. ఫలితంగా అనధికార కార్యవర్గంలో ఉన్నవ్యక్తిపై జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ పెట్టిన కేసుల సెక్షన్లు పనిచేస్తున్నాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. చూడాలి ప్రభుత్వం ఇంత జరిగిన తరువాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!